100 లేదా ఒక వంద (నూరు) ఒక సంఖ్య. దీనిని రోమన్ సంఖ్యామానంలో Ⅽతో సూచిస్తారు. [1] ఇది 99, 101 ల మధ్య ఉన్న సహజ సంఖ్య. భారతీయ సంఖ్యా మానము ప్రకారం పది పదులు. దీనిని శత అని కూడా అంటారు.

99 100 101
Cardinalone hundred
Ordinal100th
(one hundredth)
Factorization22· 52
Divisors1, 2, 4, 5, 10, 20, 25, 50, 100
Roman numeralC
Unicode symbol(s)C, ⅽ
Binary11001002
Ternary102013
Quaternary12104
Quinary4005
Octal1448
Duodecimal8412
Hexadecimal6416
Vigesimal5020
Base 362S36
Greek numeralρ
Arabic١٠٠
Bengali১০০
Chinese numeral佰,百
Devanagari१००
Hebrewק (Kuf)
Khmer១០០
Korean
Tamil௱, க00
Thai๑๐๐
వంద రూపాయల నోటు

గణిత శాస్త్రంలో

మార్చు

10కి వర్గం 100. దీనిని 102గా సూచిస్తారు. S.I ప్రమాణం ప్రకారం దీనిని ప్రమాణాల పూర లగ్నంగా "హెక్టా" అని ఉపయోగిస్తారు. అనగా ఒక హెక్టా మీటరు అనగా 100 మీటర్లని అర్థం.

శాతాలకు ఆధారం 100. శాతమనగా 100కి అని అర్థం. 35% అనగా 100కి 35 అని అర్థం. పూర్తి భాగాన్ని 100%గా గుర్తిస్తారు.

100ను మొదటి 9 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. అదే విధంగా జంట ప్రధాన సంఖ్యల మొత్తంగా కూడా రాయవచ్చు. ఉదా: 3 + 97, 11 + 89, 17 + 83, 29 + 71, 41 + 59, 47 + 53.

100ను మొదటి నాలుగు ధన పూర్ణసంఖ్యల ఘనాల మొత్తంగా కూడా రాయవచ్చు (100 = 13 + 23 + 33 + 43). అదే విధంగా 100 ను మొదటి నాలుగు సహజ సంఖ్యల మొత్తానికి వర్గంగా కూడా రాయవచ్చు. 100 = 102 = (1 + 2 + 3 + 4)2[2]

26 + 62 = 100, అందువలన 100 అనేది లేలాండ్ సంఖ్య అవుతుంది.[3]

10 భూమిగా గల హర్షాద్ సంఖ్య 100.[4]

విజ్ఞాన శాస్త్రంలో

మార్చు

పరమాణు సంఖ్య 100గా గల మూలకం ఫెర్మియం, ఇది ఆక్టినైడ్ మూలకం, మొదటి భారలోహం.

సెల్సియస్ స్కేలులో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్.

సముద్రమట్టం నుండి 100 కి.మీ ఎత్తులోగల రేఖను కార్మాన్ రేఖ అంటారు. ఇది భూ వాతావరణానికి, బాహ్య అంతరిక్షానికి మధ్య గల రేఖ.

ద్రవ్యమానం

మార్చు

భారతీయ ద్రవ్యమానంలో ఒక రూపాయికి 100 పైసలు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Reïnforced by but not originally derived from Latin centum.
  2. మూస:Cite OEIS
  3. "Sloane's A076980 : Leyland numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-27.
  4. "Sloane's A005349 : Niven (or Harshad) numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-27.
"https://te.wikipedia.org/w/index.php?title=నూరు&oldid=3833311" నుండి వెలికితీశారు