నెల్లూరి పెద్దారెడ్డి

నెల్లూరి పెద్దారెడ్డి 2018లో విడుదలైన తెలుగు సినిమా. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రఘునాథ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వి. జయరాం రెడ్డి దర్శకత్వం వహించాడు, సతీష్ రెడ్డి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2018, మార్చి 18న విడుదలైంది.[2] ఈ సినిమా ‘ఊర్వశి ఓటిటి’ లో 2021 మే 21న విడుదలైంది.[3]

నెల్లూరి పెద్దారెడ్డి
దర్శకత్వంవి.జయరాం రెడ్డి
స్క్రీన్ ప్లేపోలూరు ఘటికాచాలం
నిర్మాతసి.హెచ్.రఘునాథ్ రెడ్డి
తారాగణంసతీష్ రెడ్డి
మౌర్యానీ
ఛాయాగ్రహణంబాలసుబ్రహ్మణ్యం
సంగీతంగురురాజ్
నిర్మాణ
సంస్థ
సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్
విడుదల తేదీ
16 మార్చి 2018[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ నేపథ్యం

మార్చు

ఓ ఊరిలో నలుగురికి మంచి చేసే ఊరి సర్పంచ్ అయిన పెద్దారెడ్డి (సతీష్ రెడ్డి) అదే ఊరిలో ఉండే కామాక్షి (మౌర్యాని) కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. కామాక్షి తో పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది . ఈ విషయం పెద్దారెడ్డి భార్య ముంతాజ్ కు తెలియడంతో మీనాక్షి ని చంపించడానికి పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి ఏం చేశాడు అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు
  • సతీష్ రెడ్డి - నెల్లూరి పెద్దారెడ్డి
  • మౌర్యాని - కామాక్షి
  • ముంతాజ్
  • ప్రభాస్ శ్రీను - కుక్కుటేశ్వర్
  • అంబటి శ్రీను
  • లక్ష్మీ
  • సుజాత
  • బేబీ దివ్య

సాంకేతికవర్గం

మార్చు
  • ఫైట్స్: రవి
  • ఎడిటింగ్: శ్రీను
  • సంగీతం: గురురాజ్
  • ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం
  • కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే: పోలూరు ఘటికాచలం
  • నిర్మాత: సి.హెచ్.రఘునాథ్ రెడ్డి
  • రచన-దర్శకత్వం: వి.జయరాం రెడ్డి

మూలాలు

మార్చు
  1. Sakshi (12 March 2018). "నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  2. Vaartha (10 March 2018). "ముస్తాబైన 'నెల్లూరి పెద్దారెడ్డి'". Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.
  3. Santhosham (14 May 2021). "Nelluri Peddareddy : "నెల్లూరి పెద్దారెడ్డి" ఓటిటి విడుదల.! - Santosham Magazine". Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.