నేతి శ్రీరామశర్మ
నేతి శ్రీరామశర్మ సంగీత విద్వాంసులు.[1] వీరు ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అచ్చటనే పదవీ విరమణ పొందారు.[2]
నేతి శ్రీరామశర్మ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | విశాఖపట్నం | 1928 నవంబరు 14
మరణం | 2012 మే 2 | (వయసు 83)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం, భారతీయ సంగీతం |
వృత్తి | Vocalist, Violinist |
వాయిద్యాలు | వయోలిన్, వయోల |
ముఖ్యమైన సాధనాలు | |
వయోలిన్ |
జీవిత విశేషాలు
మార్చునేతి శ్రీరామశర్మ కృష్ణా జిల్లా లోని వల్లభాపురంలో లక్ష్మీనారాయణ, సీతారామమ్మ దంపతులకు 1928 నవంబరు 14 న జన్మించారు.[3] ఈయన తండ్రి తండ్రి హరికథా భాగవతులైన కారణాన, విజయవాడలో గాయక సార్వభౌమ కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద వయొలిన్, గాత్ర సంగీతం, గురుకుల పద్ధతిలో శిక్షణనందుకున్నారు.[4] అచట ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి గార్లు ఈయనతో పాటు అచట అభ్యసించినవారే. అచట వయోలిన్ విధ్వాంసునిగా విశేష ప్రతిభకనబరచారు.
ఉద్యోగ జీవితం
మార్చుఆయన 1958 లో ఆల్ ఇండియా రేడియోలో స్ఠాప్ ఆర్టిస్టుగా చేరారు. అచట 1988 వరకు కొనసాగారు.[5] ఉద్యోగ నిర్వహణలోను, ఆకాశవాణి జాతీయ సమ్మేళనాలలోను జాతీయంగా ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులందరికీ వయొలిన్ సహకారం అందించి వారి ప్రశంసలందుకున్నారు. ఆయన వందలమంది విద్యార్థులకి గురుకుల పద్ధతిలో సంగీత శిక్షణనందించారు. రేడియో ద్వారా సంగీత పాఠాలు కూడా కొద్దికాలం నిర్వహించారు.ఆయన గురువులైన పారుపల్లి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వర్థంతులు, జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన అనేకమంది ప్రజ్యాత సంగీతకారులకూ శిక్షణనిచ్చారు. అందుకే శిష్యులందరూ అత్యంత ఆత్మీయంగా ‘సంగీతానంద’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.
ఆయన అనేక సంగీత సాహిత్య సంస్థలకు లక్షకుపైగా ధన సహాయం అందించిన వితరణశీలి. వినయశీలియైన వయొలిన్ విద్వాంసులు నేతి శ్రీరామశర్మ 84 ఏళ్ళ వయస్సులో మే 2 2012 న హైదరాబాద్‌లో స్వగృహంలో స్వర్గస్తులైనారు.[6]
అవార్డులు
మార్చు- 2006 : శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం.[7]
మూలాలు
మార్చు- ↑ "Vijayanagar Fine Arts". Archived from the original on 2015-07-12. Retrieved 2015-05-26.
- ↑ Tribute Musician and teacher leaves behind a extraordinary legacy.
- ↑ biography of Neti Sreerama Sarma[permanent dead link]
- ↑ సిసలైన సంగీత గురువు[permanent dead link]
- ↑ SANGEETHA VIDWAN SRI NETHI SRI RAMA SARMA
- ↑ Nethi Srirama Sarma, 83 passed away on May 2 హిందూ ఆర్టికల్
- ↑ "Pratibha Puraskaralu". Archived from the original on 2016-03-05. Retrieved 2015-05-26.