నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్మెంట్

కోల్డ్ చైన్ డెవలప్ మెంట్ (The National Centre for Cold-chain Development (NCCD)పై టాస్క్ ఫోర్స్ తన నివేదికలో భారతదేశంలో నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్ మెంట్ (ఎన్ సిసిడి) ను రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యవసాయం లోని  పాడైపోయే ఆహార ఉత్పత్తులను, పాడైపోయే అనుబంధ ఉత్పత్తులు  వాటి  కోసం భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ ను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో సన్నిహిత సహకారంతో పనిచేయడానికి రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పాటు చేయాలని సూచించింది. రైతులకు, వినియోగదారులకు గణనీయంగా లాభాలకు , అనుబంధ రంగాలతో సహా పాడైపోయే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కోసం భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ ను ప్రోత్సహించడానికి,అభివృద్ధి చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్ మెంట్ (ఎన్ సిసిడి) స్థాపించబడింది. ఎన్ సిసిడి 27.01.2011 న సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1860 కింద సొసైటీగా నమోదు చేయబడింది[1].

కోల్డ్ చైన్  ను నిర్వచిస్తే  పాడైపోయే ఉత్పత్తుల  ఉష్ణోగ్రతను నిర్వహించడం, పంపిణి ( డిస్ట్రిబ్యూషన్ చైన్) ద్వారా ఉత్పత్తి  నుండి తుది వినియోగదారుడి వరకు నాణ్యత, భద్రతను నిర్వహించడాన్ని సూచిస్తుంది. శీతల గిడ్డంగుల (కోల్డ్ చైన్ ) ఉత్పత్తులు సురక్షితమైనవి, వినియోగ సమయంలో అధిక నాణ్యత కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది[2].

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్మెంట్
సంకేతాక్షరంఎన్ సి సి డి
స్థాపనఫిబ్రవరి 9, 2012 (2012-02-09)
రకంస్వయంప్రత్తి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ
చట్టబద్ధతసొసైటీ
కేంద్రీకరణభారతదేశంలో కోల్డ్ చైన్ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి మధ్యగా ఉన్న భాగస్వామ్య సంస్థ
ప్రధాన
కార్యాలయాలు
న్యూ ఢిల్లీ i
కార్యస్థానం
  • జన్ పథ్ భవన్, న్యూఢిల్లీ
మూలాలుప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం
సేవా ప్రాంతాలుభారతదేశం
సభ్యులుప్రభుత్వ, ప్రైవేటు
నిర్వహణ అధికారిడాక్టర్ బి.ఎన్.ఎస్.మూర్తి (ఉద్యానశాఖ కమిషనర్) (2020- )
డైరెక్టర్రాజ్బీర్ సింగ్, జాయింట్ సెక్రటరీ (డీఏసీ) (2019- )
వ్యవస్థాపక సలహాదారు, ముఖ్య నిర్వహణ అధికారికెప్టెన్ పవన్ కోహ్లీ (2012–2020)
వ్యవస్థాపక సలహాదారుశైలేందర్ కుమార్ (2012–2013)
ప్రధానభాగంసాంకేతిక కమీటీలు
జాలగూడుhttp://nccd.gov.in
రిమార్కులుఈ సమావేశానికి భారత వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. వ్యవస్థాపక అధ్యక్షుడు - ఆశిష్ బహుగుణ (2012–2015)

అవలోకనం

మార్చు

భారతదేశం పండ్లు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ పండ్లు, కూరగాయల తలసరి లభ్యత చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే కోత అనంతర నష్టాలు ఉత్పత్తిలో 25% నుండి 30% వరకు ఉన్నాయి. దీనికితోడు వినియోగదారుడికి చేరే సమయానికి గణనీయమైన పరిమాణంలో ఉత్పత్తి నాణ్యత కూడా క్షీణిస్తుంది. పండ్లు, కూరగాయల మార్కెటింగ్ కు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. అధిక మార్కెటింగ్ ఖర్చులు, మార్కెట్ లోటుపాట్లు, ధరల హెచ్చుతగ్గులు, ఇతర సారూప్య సమస్యలకు పాడైపోవడం అని చెప్పవచ్చును. భారతదేశంలో మొట్టమొదటి శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోర్) 1892 లో కలకత్తాలో స్థాపించబడింది. శీతల గిడ్డంగులలో సరైన పరిస్థితులు ఉండేలా చూడటానికి, శాస్త్రీయ పద్ధతిలో పరిశ్రమను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిత్యావసర వస్తువుల చట్టం-1955లోని సెక్షన్ 3 కింద "కోల్డ్ స్టోరేజీ ఆర్డర్, 1964" అని పిలువబడే ఉత్తర్వును జారీ చేశాయి. భారతదేశంలో సంవత్సరానికి  130 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరుగుతుందని అంచనా.  దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 18%. వైవిధ్యమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, మెరుగైన లభ్యత కారణంగా ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. ఉత్పత్తిని పెంచడానికి విస్తారమైన అవకాశం ఉన్నప్పటికీ, శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజీ), కోల్డ్ చైన్ సౌకర్యాలు లేకపోవడం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నశీతల గిడ్డంగుల సౌకర్యాలు ఎక్కువగా బంగాళాదుంప, నారింజ, ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, పువ్వులు వంటి ఒకే వస్తువుకు ఉన్నాయి, దీని ఫలితంగా తక్కువ సామర్థ్యం వినియోగం జరుగుతుంది.

కోల్డ్ స్టోరేజీ యూనిట్ లో  సాంకేతికత ఉపయోగం  సరుకులు నిల్వ చేయడానికి కావలసిన గది వాతావరణాన్ని నిర్వహించడానికి శీతలీకరణ వ్యవస్థ ఉంటుంది. శీతలీకరణ వ్యవస్థ రెండు సూత్రాలపై పనిచేస్తుంది అవి ఆవిరి శోషణ వ్యవస్థ ( Vapour absorption system (VAS), వేపర్ కంప్రెషన్ సిస్టమ్ (విసిఎస్) (vapour compression system) లు ఉంటాయి[3].

విధులు

మార్చు
  • నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్ మెంట్ (ఎన్ సిసిడి) విధులు [4].
  • అంతర్జాతీయ ప్రమాణాలు, ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా కోల్డ్ చైన్  వసతులకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్)/  ప్రమాణాలు, నిభందనలు ( ప్రోటోకాల్స్) సిఫారసు చేయడం, కోల్డ్ చైన్ పరిశ్రమ ద్వారా అందించబడే మౌలిక సదుపాయాలు/బిల్డింగ్, ప్రాసెస్ , సేవల బెంచ్మార్కింగ్, నాణ్యత ధ్రువీకరణ (సర్టిఫికేషన్) కొరకు యంత్రాంగాన్ని సిఫారసు చేయడం.
  • సంభావ్య పెట్టుబడిదారులు/ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు ప్రాజెక్ట్ రిపోర్టుల తయారీ కొరకు సూచనాత్మక మార్గదర్శకాలను సూచించడం.
  • కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు తగిన  సాంకేతిక (ఐ టి) ఆధారిత మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని మదింపు, అభివృద్ధి చేయడం.
  • భాగస్వాములతో సంప్రదింపులు జరిపి కోల్డ్ చైన్ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) పనులను చేపట్టడం, సమన్వయం చేయడం.
  • మానవ వనరుల అభివృద్ధి (హెచ్ ఆర్ డీ), సామర్థ్యాన్ని పెంపొందించే నిమిత్తం , సమన్వయం చేయడం. కోల్డ్ చైన్ డెవలప్ మెంట్ కు సంబంధించిన అంతర్గత శిక్షణ, స్వల్పకాలిక/దీర్ఘకాలిక కోర్సులను అందించడం. .
  • ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్స్  ప్రయోజనాల గురించి ప్రజలలో  అవగాహన పెంపొందించడంతో సహా భాగస్వాములకు అవగాహన కల్పించడానికి ప్రచారాన్ని ప్రారంభించడం,కోల్డ్ చైన్ అభివృద్ధికి సంబంధించి తగిన  సూచనలు , సిద్ధాంతాలను చేయడం (పాలసీ ఫ్రేమ్ వర్క్) వంటివి ఉన్నాయి.
  • పాడైపోయే వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ వస్తువుల కోసం బహుళ-నమూనా రవాణా సౌకర్యాల అభివృద్ధిని సులభతరం చేయడం, ప్రోత్సహించడం, పాడైపోయే వస్తువుల స్థాపన కొరకు నేషనల్ గ్రీన్ గ్రిడ్ చేపట్టడం.
  • తాజా పండ్లు, కూరగాయలతో సహా పాడైపోయే ఆహార పదార్థాల కోసం కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల కోసం సాంకేతిక ప్రమాణాలను సిఫారసు చేయడం, సాంకేతిక పురోగతికి అనుగుణంగా వాటి క్రమానుగత సవరణలను చేపట్టడం, దేశంలోని కోల్డ్ చైన్ రంగంలోని నైపుణ్యం కలిగిన మానవ శక్తి అవసరాలను తీర్చడానికి కన్సల్టెన్సీ వర్క్, కోల్డ్ స్టోరేజీల సర్టిఫికేషన్, వాటి రేటింగ్స్, అప్లైడ్ ఆర్ అండ్ డి, మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇది నిర్వహిస్తుంది.
  •  
    భారత్ లో కోల్డ్ స్టోరేజీకి బంగాళదుంప రవాణా
    ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.  

ప్రయోజనం

మార్చు
  • కోల్డ్ చైన్ మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి చాలా కీలకం. దేశ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అన్ని వేళల సరసమైన ధరలలో ఆహార వస్తువులు అందుబాటులో ఉండటమే గాక, రైతుల ప్రయోజనాల పరిరక్షణ జరుగుతుంది.
  • ఆహారం, ఔషధాలు, ఇతర ఉత్పత్తులను అవి పండించిన లేదా వెలికితీసిన ప్రదేశం నుండి, తయారీ ప్రక్రియ ద్వారా, దుకాణాలు, రెస్టారెంట్లకు చివరిగా వినియోగదారునికి సురక్షితంగా రవాణా చేయడం ద్వారా, కోల్డ్ చైన్ ఆధునిక జీవితాన్ని సాధ్యం చేస్తుంది.
  • సప్లై చైన్ ద్వారా ప్రతి ఉత్పత్తికి భిన్నమైన ప్రయాణం ఉంటుంది. ఉదాహరణకు బఠానీల సంచి వంటి ఆహార ఉత్పత్తిని చూస్తే, వాటిని సాగు చేయడం, పంట వచ్చిన తర్వాత చేసే పని (ప్రాసెస్ ), ప్యాక్ చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చిట్టచివరకు అమ్మడం ఉంటాయి . ఈ సరఫరా గొలుసు ఒక కంపెనీ బాధ్యత కావచ్చు, చివరి నుండి చివరి వరకు, లేదా ఇది అనేక విభిన్న కంపెనీలను కలిగి ఉంటుంది.
  • మౌలిక సవాలును పంచుకుంటాయి. గొలుసు ప్రతి దశలో ఉత్పత్తి తగిన, సురక్షితమైన, ఉష్ణోగ్రత వద్ద ఉంచబడిందని వారు నిర్ధారించుకోవాలి. కోల్డ్ చైన్ నిర్వహణ చాలా నిర్దిష్ట బాధ్యత, ప్రత్యేక నైపుణ్యాలు, జ్ఞానం, సౌకర్యాలు, వాహనాలు ,సాంకేతికత అవసరం ఉంటాయి[5].

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్మెంట్ (ఎన్సీసీడీ) నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్టేటస్ అండ్ గ్యాప్ అసెస్మెంట్) నిర్వహించిన 'ఆల్ ఇండియా కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ (స్టేటస్ అండ్ గ్యాప్ అసెస్మెంట్)' అనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో కోల్డ్ స్టోరేజీ అవసరం 35 మిలియన్ మెట్రిక్ టన్నులు, నిల్వ సామర్థ్యం సుమారు 32 మిలియన్ మెట్రిక్ టన్నులు.

 
లఖ్నౌర్ కోల్డ్ స్టోరేజ్ - మొహాలీ

ప్రభుత్వం సొంతంగా ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనప్పటికీ, సంబంధిత పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వ్యక్తులు/ సంస్థలు ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పిఎంకెఎస్వై), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడిహెచ్) వంటి వివిధ డిమాండ్ ఆధారిత పథకాలను అమలు చేస్తోంది[6].


,

మూలాలు

మార్చు
  1. "National Centre for Cold-chain Development (NCCD)". ARCH-India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-09.
  2. "About the Cold Chain". Global Cold Chain Alliance (in ఇంగ్లీష్). 2018-02-14. Retrieved 2023-02-09.
  3. "Agricultural Marketing :: COLD STORAGE". agritech.tnau.ac.in. Retrieved 2023-02-09.
  4. "National Centre for cold chain development(NCCCD) - JournalsOfIndia" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-09. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.
  5. "What is the cold chain? - Cold Chain Federation" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-05-13. Retrieved 2023-02-09.
  6. "Capacity of Cold Chains". pib.gov.in. Retrieved 2023-02-09.