భావంసవరించు

మనుషులకూ మిగిలిన ప్రాణులకు వున్న తేడా ఆలోచించడం, మాట్లాడటం, చేతులు ఉపయోగించడం. వీటన్నిటి మధ్యనా అంత:సంబంధం వుంటుంది. ఇందులో ఏది చేయాలన్నా భౌతికంగానూ భావపరంగానూ ప్రేరణ వుండాలి. ప్రకృతిసిద్ధంగా కలిగే ఆకలి బాధ వంటి అంశాలు కొన్నయితే మిగిలినవన్నీ భావాలను బట్టి జరగాల్సిందే. భావం భౌతిక ప్రాతిపదిక నుంచే వస్తుంది తప్ప కొంతమంది అంటున్నట్టు మనం అనుకున్నదాన్ని బట్టి అంతా జరగదు. అనుకున్నట్టు చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న. దీన్ని అటు నుంచి చూస్తే ప్రేరణ అంటూ లేకపోతే మనిషి కార్యాచరణకు పూనుకోవడం జరగదు. ప్రేరణ సరైందైతే కార్యాచరణా సరిగ్గా వుంటుంది. అదే పొరబాటుగా వుంటే దాన్ని బట్టి జరిగేది మరింత నష్టదాయకమవుతుంటుంది.

ప్రేరణసవరించు

ప్రేరణ ఎక్కడినుంచి రావాలంటే ఆలోచనల నుంచి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే పరిశీలన నుంచి. పరిశీలనకు కొలబద్దలు సరిగ్గా వుంటే సరైన ఆలోచనలు వస్తాయి. వాటిని సక్రమంగా అమలు చేస్తే అప్పుడు ఆహ్వానించదగిన ఫలితాలూ కలుగుతాయి. ఇందులో ఏది తప్పినా ఫలితం అరకొరగానే వుంటుంది. కొన్నిసార్లు తప్పుగా ముప్పుగా కూడా మారుతుంది. ప్రేరణనే ఇంగ్లీషులో మోటివేషన్‌ అంటుంటారు. బాగా చదువుకోవాలి, బాగా పాడాలి, బాగా పనిచేయాలి, భేష్ అనిపించుకోవాలి, పది మందికి మన వల్ల మేలు జరగాలి. కుటుంబానికి సేవ చేయాలి, కళారంగంలో రాణించాలి, అన్నీ తెలుసుకోవాలి, అందరితో స్నేహంగా వుండాలి ఇలాంటివన్నీ మంచి ప్రేరణలు. ఇందుకు కారణాలు కారకులు ఎవరైనా కావచ్చు. ఎవరైనా బాగా పాడుతుంటే చూసి మీరు ఉత్సాహపడి వుండొచ్చు. బాగా రాణించడానికి అవసరమైన ప్రతిభ మీలో ఉందని ఎవరైనా నేస్తం ప్రేమగా ఇచ్చిన భరోసా మిమ్మల్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబెట్టవచ్చు. ఒక విప్లవ పోరాట గాథ చదివి విప్లవ నాయకుడి జీవితం చూసి మీరు ఉత్తేజపడి వుండొచ్చు. ఒక రచన ఒక ఉపన్యాసం ఒక ఉద్యమం మీకు ప్రేరణగా వుండొచ్చు.అమ్మ, నాన్న, తాతయ్య, గురువు, స్నేహితులు ఏదైనా మీకు ప్రేరణనిచ్చి వుండొచ్చు.

నిర్ణయంసవరించు

భర్త్రహరి సుభాషితాలతో సహా ఏ శతకం చదివినా అధములు, మధ్యములు, ఉత్తములు అనే వర్గీకరణ కనిపిస్తుంది. ఇంగ్లీషులో గుడ్‌- బెటర్‌- బెస్ట్‌ అన్నట్టుగా. స్కూలులోనూ ఆఫీసుల్లోనూ కూడా మార్కులను ఫలితాలను బట్టి ప్రోగ్రెస్‌ కార్డు ఇస్తూనే వుంటారు. జీవితంలోనూ అత్యంత సమర్థులు సగటు పనిమంతులు తారసపడుతుంటారు. ఇలా మూడు తరగతులు ఎందుకు వుంటాయి? ఇందులో మనం తరగతిలో వుంటామనేది ఎలా నిర్ణయమవుతుంది? దీనికి ఒకే జవాబు ప్రేరణ.

బలంసవరించు

మనం ఎంత బలమైన ప్రేరణ పొందాం, శక్తియుక్తులను నిరంతరం ఎంత బలంగా పనిలో పెడుతున్నాం అనేదే ఫలితాలను నిర్ణయిస్తుంది. స్వతస్సిద్ధమైన ప్రేరణ లేనప్పుడు పరిస్థితి నిస్సారంగా తయారవడం అనివార్యం. ప్రోత్సాహం ఉత్సాహమిస్తుందని అందరూ అంగీకరిస్తారు. అయితే ఎంతగా ప్రోత్సహించినా కొందరు అందుకోవడానికి ముందుకు రావడానికి ఎందుకు సిద్దం కారంటే మానసిక శారీకర బద్దకమే కారణం. తమలో చాలా సమర్థత వున్నా వుండాల్సిన ప్రోత్సాహం లేదని ఇతరులకు అనుచిత ప్రోత్సాహం ఇస్తున్నారని అనేక మంది ఫిర్యాదు చేస్తుంటారు. అదే నిజమైతే ఒక వేళ మనల్ని ఎవరూ ప్రోత్సహించలేదనుకున్నా దాంతోనే మనం వెనకబడి పోవాలా? ఇతరులు మనల్ని ప్రోత్సహించకపోతే మనం నిరుత్సాహపడటం మానేయాలా?

ప్రోత్సాహంసవరించు

ప్రోత్సాహం అనేది అదనమే తప్ప అవసరం కాకూడదు. మనల్ని ప్రోత్సహించడం కోసమే ఎవరూ పనిగట్టుకుని కూచోకపోవచ్చు. వారికి ప్రతిభ ఉందా, లేదా అని మనల్ని చూసి ముచ్చటపడి మెచ్చుకోవచ్చు. సహాయపడొచ్చు కూడా. అయితే అది ఎల్లకాలం జరక్కపోవచ్చు. ఆ మనుషులు మన దగ్గరే వుండకపోవచ్చు. ఉన్నా వారి సమస్యల్లో చిక్కుకుపోవచ్చు. వారి భావాలు మారిపోవచ్చు. బదిలీ కావచ్చు. చెప్పాలంటే ఇలాంటి సందర్భాలు సర్వసాధారణం. మన చుట్టూ వున్నవారికి అంత వ్యవధి వుండకపోవచ్చు. దృష్టి వుండకపోవచ్చు. అంతమాత్రాన ఎవరు చేయవలసిన కృషి వారు చేయకుండా వుండటం పొరబాటవుతుంది.

విజయంసవరించు

మోటివేషన్‌ ఎక్కడినుంచి రాకపోయినా మనకు మనమే మోటివేట్‌ చేసుకోవడం అలవర్చుకోవాలి. అంటే మన లక్ష్యాల నుంచి ఆశయాల నుంచి భావాల నుంచి బాధ్యతల నుంచి మనం పొందే ప్రేరణ నిరంతరాయమైంది. అప్పుడు ఆ ఫలితాలే మనకు మరింత ప్రేరణ అవుతాయి. కలుగుతున్న మంచి ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటే అంతకు మించిన ప్రేరణ వుండదు. అయితే అలా తమనూ తమ కృషి ఫలితాలను కూడా చాలా మంది సరిగ్గా పరిశీలించుకోరు. సాధించిన దానికి సంతృప్తి చెంది అదే విజయమనుకుంటే పొరబాటవుతుంది అని మహాకవి శ్రీశ్రీ అన్నాడంటే అర్థం ఆగిపోవద్దని, సాధించిన దానితో సంతృప్తి చెందకుండా మరింత ముందకు పొమ్మని దాని సారాంశం. అంతేగాని సాధించిన దాన్ని తక్కువ చేసుకుని నిరాశపడాలని కానేకాదు. ఎందుకంటే లోకంలో విజయం అన్నది ఎప్పుడూ అసంపూర్ణమే. సాధించవలసిన ఫలితాలు అధిరోహించ వలసిన శిఖరాలూ పూర్తి చేయాల్సిన కర్తవ్యాలు ఎప్పుడూ మిగిలేవుంటాయి. అది జరగాలన్నా శాశ్వత నేస్తం స్వీయ ప్రేరణ మాత్రమే.

ఫలితంసవరించు

చివరగా మనల్ని ఎవరూ ప్రోత్సహించలేదని విచారించేవారు దిగాలు పడే వారు తాము ఎవరినైనా ప్రోత్సహించడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు.'మోటివేటింగ్‌' అనే ఇంగ్లీషు పదానికి 'మోటు వేటింగ్‌' అనే తెలుగీకృత పదానికి తేడా చాలా వుంటుంది. ఆధునిక మానవులు మోటుగా వేటు వేయడం కాక మోటివేషన్‌తో వ్యవహరిస్తే ఫలితాలూ అంత నాణ్యంగా వుంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=నేస్తం&oldid=3112624" నుండి వెలికితీశారు