నేహాల్ చుడాసమా (ఆంగ్లం: Nehal Chudasama; జననం 1996 ఆగస్టు 22) భారతీయ మోడల్, ఫిట్‌నెస్ కన్సల్టెంట్, అందాల పోటీ టైటిల్‌హోల్డర్.[2] ఆమె మిస్ దివా యూనివర్స్ 2018 కిరీటాన్ని పొందింది. అలాగే, ఆమె మిస్ యూనివర్స్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[3] ఆమె గుజరాత్‌లో కనిపించే కోలీ సామాజికి వర్గానికి చెందినది.[4][5]

నేహాల్ చుడాసమా
అందాల పోటీల విజేత
జననమునేహాల్ చుడాసమా
(1996-08-22) 1996 ఆగస్టు 22 (వయసు 28)
ముంబై, భారతదేశం
విద్యసెయింట్ రాక్స్ స్కూల్,[1] ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్
పూర్వవిద్యార్థిఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్[1]
వృత్తిమోడల్, టీవి హోస్ట్
బిరుదు (లు)మిస్ యూనివర్స్ ఇండియా 2018
ప్రధానమైన
పోటీ (లు)
  • మిస్ దివా - 2018
    (విజేత - మిస్ దివా యూనివర్స్ 2018)
  • మిస్ యూనివర్స్ 2018

ప్రస్థానం

మార్చు

2018లో, ఆమె ఫెమినా మిస్ గుజరాత్ టైటిల్ కోసం ఆడిషన్ చేసింది, అక్కడ ఆమె టాప్ 3 ఫైనలిస్ట్‌లలో ఒకరు.[6] తరువాత, అదే సంవత్సరం, ఆమె మిస్ దివా - 2018 పోటీలో పాల్గొని మిస్ దివా యూనివర్స్ 2018 టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె అవుట్‌గోయింగ్ టైటిల్ హోల్డర్ శ్రద్ధా శశిధర్ చేత కిరీటం పొందింది.[7] ఆమె 'మిస్ బాడీ బ్యూటిఫుల్', 'మిస్ మల్టీమీడియా' అనే ఉపశీర్షికలను కూడా గెలుచుకుంది. 2018 డిసెంబరు 17న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2018 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, కానీ టాప్ 20లో చేరలేదు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Miss Universe 2018: Mumbai girl Nehal Chudasama to represent India". Zee News. 1 September 2018.
  2. "Nehal Chudasama's weight loss journey is mind-blowing". 6 September 2018.
  3. "Mumbai's Nehal Chudasama is Yamaha Fascino Miss Diva Universe 2018". Times of India. 1 September 2018.
  4. "Bollywood Model Nehal Chudasama Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-10-12.
  5. AllGlobal.net. "Nehal Chudasama information". Global Information Lookup (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-12.
  6. "Femina Miss India 2018: Gujarat Auditions". Indiatimes. 13 May 2018.
  7. "Miss Universe 2018: Nehal Chudasama to represent India", Hindustan Times, 1 September 2018