నేహా పెండ్సే బయాస్

మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి

నేహా పెండ్సే బయాస్[2] మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి.[3] జీ మరాఠీలో వచ్చిన భాగ్యలక్ష్మిలో నటించింది. హిందీ, మరాఠీ,[4] తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో కూడా నటించింది. మే ఐ కమ్ ఇన్ మేడమ్‌లో సంజనా హితేషి పాత్రతో గుర్తింపు పొందింది. 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.[5] భాబీజీ ఘర్ పర్ హైన్‌లో అనితా విభూతి నారాయణ్ మిశ్రా పాత్రతో మరింత గుర్తింపు వచ్చింది.

నేహా పెండ్సే బయాస్
నేహా పెండ్సే బయాస్ (2014)
జననం (1984-11-29) 1984 నవంబరు 29 (వయసు 40)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1995-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మే ఐ కమ్ ఇన్ మేడమ్‌?
బిగ్ బాస్ 12
భబీజీ ఘర్ పర్ హై!
జీవిత భాగస్వామి
శార్దూల్ సింగ్ బయాస్‌
(m. 2020)

నేహా పెండ్సే 1984 నవంబరు 29న విజయ్ పెండ్సే, శుభాంగి పెండ్సే దంపతులకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.[6] ఈమె సోదరి నటి మీనాల్ పెండ్సే.

వ్యక్తిగత జీవితం

మార్చు

2020 జనవరి 5న ప్రియుడు శార్దూల్ సింగ్ బయాస్‌తో నేహా వివాహం జరిగింది.[7] ఈ జంట 2019 ప్రారంభంలో డేటింగ్ ప్రారంభించి, మూడు నెలల తర్వాత ఏప్రిల్‌లో పెళ్ళి గురించి ప్రపోజ్ చేసుకున్నారు.[2][8] వివాహం తర్వాత నేహా తన పేరును మార్చుకొని, తన ఇంటి పేరుకు బయాస్‌ని కలిపింది.[2]

కెరీర్

మార్చు

1999లో ప్యార్ కోయి ఖేల్ నహిన్ సినిమాతో బాలనటిగా సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత దేవదాస్ వంటి సినిమాల్లో నటించింది.[9] ఏక్తా కపూర్ నిర్మాణంలో బాలాజీ టెలిఫిల్మ్స్ ద్వారా కెప్టెన్ హౌస్ కార్యక్రమంతో పెండ్సే టెలివిజన్ అరంగేట్రం చేసింది. 2016లో లైఫ్ ఓకే పాపులర్ కామెడీ షో మే ఐ కమ్ ఇన్ మేడమ్‌లో సంజన ప్రధాన పాత్ర పోషించింది.[10] కామెడీ దంగల్, ఎంటర్‌టైన్‌మెంట్ కీ రాత్ అనే రియాలిటీ షోలలో పాల్గొన్నది. 2018లో ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ రియాలిటీ కామెడీ గేమ్ షో కపిల్ శర్మతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[11][12] బిగ్ బాస్ పన్నెండవ సీజన్‌లో కూడా పాల్గొన్నది.[13][14][15] 4 వారాల తర్వాత అక్టోబరు 14న (28వ రోజు) తొలగించబడింది.[16][17]

మీడియా

మార్చు

2019లో ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 49వ స్థానంలో నిలిచింది.[18]

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు
1999 ప్యార్ కోయి ఖేల్ నహిన్ హిందీ
దాగ్: ది ఫైర్ [1]
2000 దీవానే నిమ్మో
2001 చుప రుస్తం: మ్యూజికల్ థ్రిల్లర్ గుడ్డి చినయ్
2002 తుమ్ సే అచ్ఛా కౌన్ హై అను దీక్షిత్
దేవదాస్ చౌరంగి
సొంతం సౌమ్య తెలుగు
2003 గోల్‌మాల్ ముంతాజ్
మౌనం పేసియాధే మహాలక్ష్మి తమిళం
ఐనిద్ ఐనిద్ కాదల్ ఐనిద్ మమతి తమిళం
2005 డ్రీమ్స్ హిందీ
మేడిన్ యుఎస్ఏ రాచెల్ మలయాళం
ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ చిత్ర కన్నడ
2006 అబ్రహం లింకన్ మలయాళం
2007 స్వామి పూజ హిందీ
పేరోడి భారతి కన్నడ
2008 వీధి రౌడీ - తెలుగు
2009 అసీమా - హిందీ
అగ్నిదివ్య నందిని మరాఠీ
2010 ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ - మలయాళం
2011 స్నేక్ అండ్ లాడర్ -
శర్యాత్ - మరాఠీ ఐటమ్ సాంగ్
దిల్ తో బచ్చా హై జీ నేహా దేశాయ్ హిందీ అతిథి పాత్ర
2012 మిస్టర్ భట్టి ఆన్ చుట్టి -
కురుక్షేత్రం - మరాఠీ ఐటమ్ సాంగ్
2013 టూరింగ్ టాకీస్
2014 దుసరి గోష్ట నేహా
బోల్ బేబీ బోల్ సోనాలి
ప్రేమసతి కమింగ్ సూన్ అంతర
2015 బాల్కడు సాయి
గౌర్ హరి దాస్తాన్ నేహా హిందీ
2016 నటసామ్రాట్ నేహా మకరంద్ బెల్వాల్కర్ మరాఠీ
35% టక్కే కథవర్ పాస్ టీచర్
2017 నాగర్ సేవక్ - ఏక్ నాయక్ కోమల్ షిండే
2020 సూరజ్ పే మంగళ్ భారీ కావ్య గాడ్‌బోలే హిందీ
జూన్ నేహా మరాఠీ

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష
1995 కెప్టెన్ హౌస్ హిందీ
పదోసన్
1996 హస్రతీన్ ఊర్జా
1998–99 మీతీ మీతీ బాతేన్
1998 పింపాల్ పాన్ మరాఠీ
2010-2011 భాగ్యలక్ష్మి కాశీ
2012 మధుబాల - ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ రియా హిందీ
2016–2017 మే ఐ కమిన్ మేడమ్? సంజన హితేషి
2017 కామెడీ దంగల్ పోటీదారు
2018 పార్ట్ నర్స్ ట్రబుల్ హో గయీ డబుల్ చమ్కు
ఫ్యామిలీ టైం విత్ కపిల్ శర్మ హోస్ట్
ఎంటర్టైన్మెట్ కీ రాత్ పోటీదారు
బిగ్ బాస్ 12
2019 ఖత్రా ఖత్రా ఖత్రా
కిచెన్ ఛాంపియన్ 5
బాక్స్ క్రికెట్ లీగ్ 4
2021–2022 భబీజీ ఘర్ పర్ హై! అనితా విభూతి నారాయణ్ మిశ్రా

మూలాలు

మార్చు
  1. "Bigg Boss 12: Here's how evicted contestant Neha Pendse is celebrating her birthday". 29 November 2018.
  2. 2.0 2.1 2.2 "Nehha Pendse on changing her name after wedding: 'Proud to be Shardul's wife, couldn't wait to change my name'". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-01-07. Retrieved 2022-07-06.
  3. "Sporting a swimsuit with ease - Neha Pendse's bodily transformation in pics". The Times of India.
  4. "'I can't starve myself'". The Times of India. 19 November 2012. Archived from the original on 4 October 2013. Retrieved 2022-07-06.
  5. "Ridhima Pandit, Devoleena Bhattacharjee & Neha Pendse to participate in 'Bigg Boss 12'?". ABP Live. 29 August 2018.
  6. "Bigg Boss 12 contestant Neha Pendse: Biography, love life, unseen photos and videos of the hot actress". India Today. 18 September 2018.
  7. "Nehha Pendse on hubby Shardul being a divorcee: I am not a virgin either; atleast he won't make mistakes that a rookie husband might". TimesofIndia.com. 9 January 2020.
  8. "Nehha Pendse to tie the knot soon". The Indian Express. 2 January 2020.
  9. "Bigg Boss 12: Who's Neha Pendse? See pics of confirmed contestant on Salman Khan's show". Hindustan Times. 16 September 2018.
  10. "Kuch Rang Pyar Ke to May I Come In Madam: 6 upcoming shows that look promising". India Today. 16 February 2016.
  11. "Ajay Devgn is the first guest on Family Time With Kapil Sharma". www.indianexpress.com. Arushi Jain. 17 March 2018. Retrieved 2022-07-06.
  12. "Family Time With Kapil Sharma: 7 things you need to know about Kapil's comeback show". www.hindustantimes.com. Correspondent. 16 March 2018. Retrieved 2022-07-06.
  13. "Bigg Boss 12: Neha Pendse to enter the show; Biography, Profile, Photos of the TV star". Pinkvilla. 16 September 2018. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 6 జూలై 2022.
  14. "Bigg Boss 12: No one knows anything about me, I am a clean slate, says Neha Pendse | Exclusive". India Today. 17 September 2018.
  15. "Nehha Pendse: Saying yes to Bigg Boss 12 was difficult as I am a very image conscious person". The Indian Express. 18 September 2018.
  16. "Nehha Pendse gets evicted from Salman Khan's Bigg Boss 12". The Indian Express. 15 October 2018.
  17. "Bigg Boss 12 evicted contestant Nehha Pendse: Dipika Kakar's leadership quality went against me". The Indian Express. 16 October 2018.
  18. "MEET THE TIMES 50 MOST DESIRABLE WOMEN 2019 - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-06.

బయటి లింకులు

మార్చు