గోల్‌మాల్ (సినిమా)

గోల్‌మాల్ పి.ఎన్.రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో శ్రీ గాయత్రి కళాచిత్ర బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 2003, ఫిబ్రవరి 21న విడుదలయ్యింది.[1] ఇది 1994లో వచ్చిన మలప్పురం హాజి మహానాయ జోజి అనే మలయాళం సినిమా రీమేక్.

గోల్‌మాల్
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
నిర్మాణం పి.ఎన్.రామచంద్రరావు
తారాగణం జె.డి.చక్రవర్తి,
రమేష్ అరవింద్,
నేహా,
మీరా వాసుదేవన్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ శ్రీ గాయత్రి కళాచిత్ర
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • ఒహో ఒహో ఖజురహో కళలవిగో అహో అహో అదరహో కథలివిగో

అమీర్ ఖాన్, అమర్ శాస్త్రి ఇద్దరూ స్నేహితులు. అమీర్ ఖాన్ ధనవంతుల బిడ్డ. అతనికి అమెరికా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేయాలని కోరిక. అమర్ శాస్త్రి పేదవాడు. కుటుంబ బాధ్యతలను అతని భుజాలపై మోస్తుంటాడు. హైదరాబాదులో తన స్నేహితుడు అబ్దుల్లా నడుపుతున్న కాలేజీలో ఉద్యోగానికి కుదుర్చుతాడు అమీర్ ఖాన్ తండ్రి తన కొడుకును. తన బదులుగా అమర్‌ను అమీర్ పేరుతో లెక్చరర్‌గా చేరమని అమీర్ ఖాన్ అభ్యర్థిస్తాడు. అబ్దుల్లా కూతురు అమీర్‌ను ప్రేమిస్తుంది. అబ్దుల్లా పోటీదారుడు నరహరి. అమెరికా వెళ్ళడానికి వీసాకోసం ప్రయత్నించిన అమీర్ ఖాన్ ముంబాయిలోని వీసా ఏజెంటుతో మోసానికి గురై తిరిగి హైదరాబాద్‌కు వచ్చి అమర్ పేరుతో నరహరి నడిపే సంస్థలో ఉద్యోగానికి చేరుతాడు. నరహరి కూతురు మీనాక్షి అమీర్ రూపంలో ఉన్న అమర్‌ను ప్రేమిస్తుంది. ఈ రెండు జంటలు తమ ప్రేమను గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ హాస్య చిత్రం కొనసాగింపు.[2]

మూలాలు

మార్చు
  1. web master. "Golmal (P.N. Ramachandra Rao) 2003". indiancine.ma. Retrieved 18 November 2022.
  2. web master. "Golmaal Story". ఫిల్మీబీట్. Retrieved 18 November 2022.

బయటి లింకులు

మార్చు