నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం
నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం(Nitrosylsulfuric acid) ఒక రసాయన సమ్మేళనపదార్థం. ఇందులో Nitrosyl ఉచ్చరణ:/ˈnʌɪtrəsʌɪl/ /ˈnʌɪtrəsɪl/ /nʌɪˈtrəʊsʌɪl/. ఈ రసాయన సంయోగపదార్థం యొక్క రసాయన సంకేతపదం NOHSO4(HO.SO2.ONO.లేదా HNO5S గా కూడా చూపవచ్చును. నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం రంగులేనటువంటి ఘన రసాయన పదార్థం. నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాణిజ్యపరంగా ఎక్కువగా కాప్రోలాక్టం(caprolactam)ను తయారీలో ఉపయోగిస్తారు.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Nitrosylsulfuric acid
| |
ఇతర పేర్లు
nitrosonium bisulfate, chamber crystals
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7782-78-7] |
పబ్ కెమ్ | 82157 |
SMILES | O=NOS(=O)(=O)O |
| |
ధర్మములు | |
HNO5S | |
మోలార్ ద్రవ్యరాశి | 127.08 g/mol |
స్వరూపం | pale yellow crystals |
సాంద్రత | 1.612 g/mL in 40% sulfuric acid soln |
ద్రవీభవన స్థానం | 73.5 °C (164.3 °F; 346.6 K) |
బాష్పీభవన స్థానం | decomposes |
decomposes | |
ద్రావణీయత | soluble in H2SO4 |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | oxidizer |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
NaHSO4 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చునైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఘన రసాయనపదార్థం. సాధారణంగా పాలిపోయిన/రంగువెలసిన పసుపురంగు స్పటికాలుగాఉండును.నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ యొక్క అణుభారం 127.08 గ్రాములు/మోల్.40% సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణంలో ఈ రసాయన సంయోగపదార్థం యొక్క సాంద్రత 1.612 గ్రాములు/సెం.మీ3.నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవీభవన స్థానం 73.5 °C (164.3 °F; 346.6 K). వేడి చేసిన ద్రవీభవన స్థానం చేరకముందే విఘటన చెందును.నీటిలో వియోగం చెందును.సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతుంది.
సంశ్లేషణ-రసాయన చర్యలు
మార్చుమంచు/హిమతొట్టి(ice bath)లో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం(H2SO4)లో సోడియం నైట్రైట్(HNO2)ను కరిగించడంవలన నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడును.
- HNO2 + H2SO4 → NOHSO4 +H2O
ప్రత్నామ్యాయంగా నైట్రిక్ ఆమ్లం, సల్ఫర్ డయాక్సైడుల రసాయనచర్య వలన కుడా నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉత్పత్తి చెయ్యవచ్చును. నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నైట్రస్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లంల మిశ్రమం వలన ఏర్పడిన నిర్జల ఆమ్లంగా భావించ వచ్చును.
ఉపయోగాలు
మార్చుసేంద్రియ రసాయన శాస్త్రంలో డైఅజోనియం లవణాలను, అమీనులను(amines)తయారుచేయుటలో నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.అలాగే NO- విడుదలచేసే రసాయన కారకాలు నైట్రో సోనియం టెట్రాఫ్లోరోబోరేట్, నైట్రోసైల్ క్లోరైడులను కూడా ఉత్పత్తి చేస్తారు