నొక్రేక్ జాతీయ ఉద్యానవనం
నొక్రేక్ జాతీయ ఉద్యానవనం మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండలలో ఉండే నొక్రేక్ అనే ఎతైన శిఖరం వద్ద ఉంది.[1]ఈ ఉద్యానవనాన్ని యునెస్కో ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ గా గుర్తింపునిచ్చింది.[2]
నొక్రేక్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
నొక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ | |
Location | దక్షిణ గారో జిల్లా, మేఘాలయ, భారతదేశం |
Nearest city | విల్లిమ్ నగర్, తురా |
Coordinates | 25°32′N 90°7′E / 25.533°N 90.117°E |
Area | 47.48 కి.మీ2 (18.33 చ. మై.) |
విస్తీర్ణం
మార్చుఈ ఉద్యానవనం 44.48 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.
జంతు సంపద
మార్చుఈ ఉద్యానవనం ఎర్ర పాండాలకు, ఆసియా ఏనుగులకు పేరుపొందింది. ఈ ఉద్యానవనంలో అరుదైన స్టంప్-టెయిల్డ్ కోతులు, మరికొన్ని కోతి జాతులకు చెందిన కోతులు ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో కొన్ని మిట్ట గిబ్బన్, పంది తోక గల కోతి, మంచు ప్రాంతంలో నివసించే నల్ల ఎలుగుబంట్లు, , జెయింట్ ఫ్లైయింగ్ ఉడతలు ఉన్నాయి. ఇది అరుదైన జంతువులకే కాకా రకరకాల పక్షు జాతులకు కూడా పేరుపొందింది. ఇందులో అడవి నిమ్మ, చెంపక, గ్రాండ్ రసమల వంటి అనేక అరుదైన జాతుల ఆర్కిడ్లు ఉన్నాయి.
చూడదగిన ప్రదేశాలు
మార్చుఈ ఉద్యానవనంలో నోక్రెక్ కొండలు, రోంగ్‌బాంగ్ డేర్ జలపాతాలు ఉన్నాయి.. ఈ ఉద్యానవనం ఆగ్నేయ దిశలో బల్పక్రం, సిమ్సాంగ్ రివర్ గేమ్ రిజర్వ్ వంటివి చూడదగిన పర్యాటక ప్రదేశాలు.
మూలాలు
మార్చు- ↑ "Three Indian sites added to UNESCO list of biosphere reserves". Sify. 27 May 2009. Archived from the original on 28 అక్టోబరు 2014. Retrieved 2019-09-30.
- ↑ "UNESCO Designates 22 New Biosphere Reserves". Environment News Service. 27 May 2009. Archived from the original on 2016-03-03. Retrieved 2019-09-30.