నొరాయ్ర్ ముషెగియన్ (అర్మేనియన్:Նորայր Մուշեղյան; 1935 నవంబరు 2 – 2011 డిసెంబరు 23) ఒక ఆర్మేనియన్ కుస్తీ పోటీదారుడు, కోచ్, ప్రజా కార్యకర్త.[1]

నొరాయ్ర్ ముషెగియన్
Personal information
Born(1935-11-02) 1935 నవంబరు 2
యెరెవాన్, ఆర్మేనియా
Died2011 డిసెంబరు 23 (2011-12-23)(వయసు 76)
యెరెవాన్, ఆర్మేనియా
Weight62 kg (137 lb)
Sport
Sportకుస్తీపోటీలు
Event(s)ఫ్రీస్టైల్ కుస్తీ
Coached byఅర్తాషెస్ నజర్యాన్

జీవిత చరిత్రసవరించు

నొరాయ్ర్ ముషెగియన్ 1935 నవంబరు 2 న యెరెవాన్ లో జన్మించారు. అతని తల్లిదండ్రులు, ముష్, సెబష్టియా, ఆర్మేనియన్ జెనోసైడ్ నుండి ప్రాణాలతో బయటపడినవారు. ముషెగియన్ ఆడిన మొదటి క్రీడ జిమ్నాస్టిక్స్, కానీ గాయం కారణంగా అతను బలవంతంగా వదిలివేయవలసి వచ్చింది. అతను అర్తాషెస్ నజర్యాన్ ఆధ్వర్యంలో 1952వ సంవత్సరంలో కుస్తీను నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రారంభంలో అతనుకు ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్ రెజ్లింగ్ మధ్య ఏది ఎంచుకోవాలో అర్ధంకాలేదు, కానీ చివరికి ఫ్రీస్టైల్ కుస్తీను ఎంచుకున్నాడు. అతను ఆర్మేనియన్ రాష్ట్ర భౌతిక సంస్కృతి ఇన్స్టిట్యూట్ నుండి 1957 లో పట్టభద్రుడయ్యాడు.

1950వ సంవత్సరం చివరకు, ముషెగియన్ సోవియట్ యూనియన్ లోనే కాకుండా ప్రపంచంలోని ఫెదర్ స్టైల్ కుస్తీపోటీ దారులలో ఒకరు. 1958, 1959 సంవత్సరాలలో అతను యు.ఎస్.ఎస్.ఆర్ చాంపియన్షిప్ 1957 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఒక కాంస్య పతకాన్ని, 1958 ప్రపంచ కుస్తీ పోటీల కప్పులో ఒక బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం, ప్రపంచ కప్పును గెలుచుకున్న మొదటి ఆర్మేనియన్ ఫ్రీస్టైల్ కుస్తీదారుడు ముషెగియన్.[2] యు.ఎస్.ఎస్.ఆర్ లో జరిగిన రెండవ స్పార్టాకియాడ్ లో అతను మొదటి స్థానంలో వచ్చారు. 1959 లో, అతను వచ్చిందిలో మొదటి స్థానంలో ఉంది. అయితే ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ,  యు.ఎస్.ఎస్.ఆర్ జాతీయ జట్టు కోచింగ్ ష్టాఫు అతనికి రోంలో జరిగిన 1960 వేసవి ఒలింపిక్స్ లో ఆడే అవకాశము ఇయ్యలేదు. తరువాత ముషెగియన్ కుస్తీ పోటీల నుండి రిటైర్ అయ్యారు. అతనకు 1966వ సంవత్సరంలో డిసర్వ్డ్ మాష్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అనే యు.ఎస్.ఎస్.ఆర్ టైటిలు వచ్చింది.

అతను యెరెవాన్ లో 1966వ సంవత్సరంలో ఫ్రీస్టైల్ కుస్తీ పోటీలో పాఠశాలను స్థాపించారు. 1971 నుండి 1977 వరకు అతను ఆఫ్ఘనిస్తాన్, మడగాస్కర్ లలో పనిచేశారు తరువాత మరలా యెరెవాన్ లో కోచింగు ఇవ్వడం మొదలుపెట్టి ఎన్నో పోటీలను నిర్వహించారు. ముషెగియన్ ను  అర్మేనియాలో ఒక క్రియాశీల పబ్లిక్ ఫిగర్, 1986లో "జొరవార్ ఆంధ్రానిక్" అనే ఒక ఆర్మేనియన్ యూనియన్ స్థాపకునిగా పిలుస్తారు.[3][4]

అతను 2011 డిసెంబరు 23న 76 సంవత్సరాల వయస్సులో యెరెవాన్ లోని తన ఇంట్లోనే మరణించారు.

సూచనలుసవరించు

  1. "Մահացել է լեգենդար հայ ըմբիշ Նորայր Մուշեղյանը" (Armenian లో). NEWS.am. 23 December 2011. Retrieved 23 December 2011. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
  2. կյանքից_հեռացել_է_լեգենդար_ըմբշամարտիկ_նորայր_մուշեղյանը (in Armenian). armenpress.am: (23 December 2011). URL accessed on 23 December 2011.
  3. Норайр Мушегян, не терпящий подлости и предательства (in Russian). golosarmenii.am: (25 November 2010). URL accessed on 13 August 2011.
  4. Музей Борьбы Чемпионаты мира (in Russian). borcy.ru. URL accessed on 13 August 2011.