నోనె

మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

నోనె (లాంగ్మై), మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది మణిపూర్ పశ్చిమ భాగంలో ఉంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు పశ్చిమాన 63 కిలోమీటర్ల (39 మైళ్ళ) దూరంలో ఉంది. గతంలో గ్రామంగా ఉన్న నోనె, మణిపూర్ కొత్త జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఒకటిగా ప్రకటించబడింది.[1]

నోనె
నోనె
పట్టణం
వర్షాకాలంలో నోనె
వర్షాకాలంలో నోనె
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లానోనె
Population
 (2011)
 • Total3,854
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్
స్త్రీ పురుష నిష్పత్తి801/1000 /
అక్షరాస్యత86.90%

జనాభా మార్చు

నానీ పట్టణంలో రోంగ్మీ తెగకు చెందిన 635 కుటుంబాలు నివసిస్తున్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 3,854 మంది జనాభా ఉన్నారు. వారిలో 2,141 మంది పురుషులు, 1,714 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 801:1000 ఉంది, ఇది మణిపూర్ రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. మొత్తం జనాభాలో 11.83% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2]

అక్షరాస్యత మార్చు

పట్టణ అక్షరాస్యత రేటు 86.90% కాగా, ఇది మణిపూర్ 76.94% తో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 93.40% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 78.71% గా ఉంది.

కులం మార్చు

జనాభాలో షెడ్యూల్డ్ తెగలవారు 60.69% మంది, షెడ్యూల్డ్ కులాలవారు 0.13% మంది ఉన్నారు.

రాజకీయాలు మార్చు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నాగ పీపుల్స్ ఫ్రంట్, మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు.[3]

రవాణా మార్చు

నోనీ సమీపంలో 2014, జూలై 28న ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన 141 మీటర్లు (463 అడుగులు) నిర్మాణం ప్రారంభమైంది. ఈ వంతెన జిరిబం - తుపుల్ - ఇంఫాల్ మార్గంలో ఉంటుంది.[4][5]

మూలాలు మార్చు

  1. "Noney Village in Nungba (Tamenglong) Manipur | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-11.
  2. "Noney Village Population - Nungba - Tamenglong, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-11.
  3. "e-Pao – Manipur News". Retrieved 2021-01-11.
  4. "Construction Work of World's tallest Railway Bridge began at Noney in Manipur". Jagranjosh.com. 2014-01-07. Retrieved 2021-01-11.
  5. "World's 'tallest' railway bridge coming up in Manipur". The Times of India. Retrieved 2021-01-11.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నోనె&oldid=3947381" నుండి వెలికితీశారు