నోనె జిల్లా

భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర ఒక కొత్త జిల్లా.

నోనె జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర ఒక కొత్త జిల్లా. తమెంగ్‌లాంగ్ జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది.[1][2][3][4][5][6] నోనె (లాంగ్‌మై) పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.

నోనె జిల్లా
మణిపూర్ రాష్ట్ర జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 24°48′N 93°36′E / 24.8°N 93.6°E / 24.8; 93.6
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంనోనె
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్

జనాభా మార్చు

ఈ జిల్లాలో 100% జనాభా గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 6568 గృహాలు ఉండగా, ప్రతి కుటుంబంలో సగటున 6 మంది నివసిస్తున్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 36,671 మంది జనాభా ఉన్నారు. ఇందులో 18,917 (52%) మంది పురుషులు, 17,754 (48%) మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో సాధారణ కులానికి చెందినవారు 2,798 (8%) మంది కాగా, షెడ్యూల్ తెగలకు చెందినవారు 33,867 (92%) మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 5,638 (15%) మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[7]

మతం మార్చు

ఇక్కడి జనాభాలో క్రైస్తవులు 35,019 మంది, హిందువులు 719 మంది, ముస్లింలు 157 మంది, సిక్కులు 13 మంది, బౌద్ధులు 48 మంది, జైనులు 13 మంది, ఇతరులు 702 మంది ఉన్నారు.

ఉప విభాగాలు మార్చు

నేనె జిల్లాలో 4 ఉప విభాగాలు ఉన్నాయి.

  • నోనె (లాంగ్‌మై)
  • నుంగ్బా
  • ఖౌపుం
  • హాచాంగ్

తెగలు, భాషలు మార్చు

ఇక్కడ రోంగ్మీ నాగ, ఇన్పుయ్ నాగ తెగలకు చెందిన వారు ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా రోంగ్మీ భాష మాట్లాడుతారు. ఇన్పు, చిరు, గాంగ్టే, థాడో వంటి మిగతా భాషలు కూడా మాట్లాడుతారు.

మూలాలు మార్చు

  1. "7 new districts formed in Manipur amid opposition by Nagas". Indiatoday.intoday.in. 2016-12-09. Retrieved 2021-01-10.
  2. "Manipur Creates 7 New Districts". Ndtv.com. 2016-12-09. Retrieved 2021-01-10.
  3. "New districts to stay, says Manipur CM". The Hindu. 2016-12-31. Retrieved 2021-01-10.
  4. "Manipur Chief Minsiter [sic] inaugurates two new districts amid Naga protests". Timesofindia.indiatimes.com. 2016-12-16. Retrieved 2021-01-10.
  5. "Simply put: Seven new districts that set Manipur ablaze". The Indian Express. 2016-12-20. Retrieved 2021-01-10.
  6. "Creation of new districts could be game-changer in Manipur polls | opinion". Hindustan Times. 2016-04-22. Retrieved 2021-01-10.
  7. "Noney (District, Manipur, India) - Population Statistics, Charts, Map and Location". citypopulation.de. Retrieved 2021-01-10.

వెలుపలి లంకెలు మార్చు