నోమితా చాందీ
నోమితా చాందీ బెంగుళూరుకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, నిరాశ్రయులైన పిల్లల పునరావాసం కోసం ఆమె చేసిన సేవలకు ప్రసిద్ధి చెందింది.
నోమితా చాందీ | |
---|---|
జననం | 1946 ఆగస్టు 21[ఆధారం చూపాలి] బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
మరణం | 2015 మే 24 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
వృత్తి | సామాజిక కార్యకర్త |
జీవిత భాగస్వామి | మోహన్ చాందీ |
పిల్లలు | 2 |
పురస్కారాలు | పద్మశ్రీ |
ఆమె లవెడాలే లోని లారెన్స్ స్కూల్లో చదివింది.[1]
ఆమె ఆశ్రయా అనే ప్రభుత్వేతర సంస్థకు వ్యవస్థాపకురాలు, కార్యదర్శి. ఆమె ప్రధానంగా నిరాశ్రయులైన పిల్లల పునరావాసం కోసం పనిచేస్తున్నది.[2][3] ఆ సంస్థ ఆధ్వర్యంలో చాండీ, ఆమె సహచరులు దేశంలో 2000 మంది పిల్లలను, బయట 1000 మంది పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడంలో విజయవంతమయ్యారు.[4] ఈ సంస్థ నీల్‌భాగ్ అనే పాఠశాలను, వలస కార్మికుల పిల్లల కోసం సురక్షితమైన క్రేచ్ నూ కూడా నడుపుతుంది. అలాగే పిల్లల సంరక్షణ కేంద్రంలో ఎనిమిది మంది దృష్టి లోపం ఉన్న పిల్లలను చూసుకుంటుంది.[5] భారత ప్రభుత్వం 2011లో నోమితా చాందీని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[6]
చాందీ 2015 మే నెలలో బెంగళూరులో మరణించింది.[7]
మూలాలు
మార్చు- ↑ Narayanan, Chitra (16 April 2011). "Bonding for a lifetime". The Hindu Businessline. Retrieved 9 April 2023.
- ↑ "Ashraya Home". Ashraya. 2014. Retrieved 19 November 2014.
- ↑ "Ashraya about". Ashraya. 2014. Retrieved 19 November 2014.
- ↑ "TOI". TOI. 14 December 2011. Retrieved 19 November 2014.
- ↑ "The Hindu". The Hindu. 19 March 2011. Retrieved 19 November 2014.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 11 November 2014.
- ↑ Menon, Parvathi (6 June 2015). "Champion for the abandoned". Retrieved 30 May 2018.
బాహ్య లింకులు
మార్చు- "Nomita Chandy". Video. YouTube. 14 April 2013. Retrieved 19 November 2014.