నోమీ నమ్మాల నోమన్నలాలా చందామామ అనేది ఒక ప్రముఖ జానపదగేయం.

స్వరకల్పన మార్చు

అవసరాల అనసూయాదేవి ఈ జానపద గేయాన్ని కీరవాణి రాగం, త్రిశ్రంలో స్వరపరచారు.[1]

ని స రీ రి స | సా సా సా | నీ స నీ స | రీ , గా రి ||
నో - మీ - న | మ ల్లా ల | నో మ - న్న | లా లో - ||
ని స రీ రి స | సా " " | ని స రీ రి స | సా " " ||
చం దా మా - | మా -- | చం దా మా - | మా - ||
 

మల్లీశ్వరి సినిమా మార్చు

మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ జానపద గేయపు పల్లవిని మాత్రం వుంచి చరణాల్ని తిరిగివ్రాసారు. ఈ గీతాన్ని భానుమతి రామకృష్ణ గానం చేశారు.[2]

నోమి నోమన్నాల నోమన్న లాలా
చందామామ... చందామామా
కొండదాటిరావోచందామామ .. కోనదాటిరావోయిచందమామ
రాజు అల్లేరావోయి చందామామ...

మంగమ్మగారి మనవడు మార్చు

ఈ చిత్రంలో బాలకృష్ణ, సుహాసిని నటించిన "వంగతోట కాడ ఒళ్ళు జాగ్రత్త" పాటలో మొదటి చరణాలలో ఈ పాట పల్లవిని ఉపయోగించారు.

నోమి నోమన్నలాల నోమన్నలాలా చందామామా.. చందమామా
నోమీ నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ
పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
బారెడంత పొద్దుంది నేరాను పోరా బూటకాల బుల్లోడా...  బూటకాల బుల్లోడా
నోమీ నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ... సందామామ.. సందామామ..సందామామ

మూలాలు మార్చు

  1. జానపద గేయాలు, ఎ.అనసూయాదేవి, ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి, హైదరాబాదు, 1983, పేజీలు:153-4.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-08-20.