కీరవాణి రాగం
కీరవాణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది 74 మేళకర్త రాగాల జాబితాలో 21 వ రాగం. [1] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో "కిరణవళి" గా పిలుస్తారు.
ఆరోహణ | S R₂ G₂ M₁ P D₁ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₁ P M₁ G₂ R₂ S |
ఈ రాగం పాశ్చాత్య సంగీతంలో కూడా గుర్తింపు పొందింది. దీనిని సమానమైన రాగం పాశ్చాత్య సంగీతంలో హార్మోనిక్ మైనర్ స్కేల్.[2] [3]ఇది కర్ణాటక సంగీతం నుండి హిందూస్థానీ సంగీతంలోకి అరువు తెచ్చుకున్నట్లు చెబుతారు.
రాగ లక్షణాలు
మార్చుఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M1 G2 R2 S)
ఈ రాగం లోని స్వరాలు చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
మార్చుచాలామంది వాగ్గేయకారులు కీరవాణి రాగంలో కీర్తనల్ని రచించారు.
- కలిగి యుంటే - త్యాగరాజు
- అంబావాణి నన్ను - ముత్తయ్య భాగవతార్
- వరములోసాగి - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
- నా పుణ్యము గాదా ఈశా - ముత్తయ్య భాగవతార్
- నిజముగ రామా నీ పాదముల నిత్య నమ్మిన నన్ను బ్రోవుము - పూచి శ్రీనివాస అయ్యంగార్
- వరములోసాగి బ్రోచుతా నీ కరుదా జగదాధర - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
- నీ చరణంబుజమును నెరనమ్మితి నీరజాక్షి - జి.ఎన్.బాలసుబ్రమణియం
జన్య రాగాలు
మార్చుకీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి.
తెలుగు సినిమా పాటలు
మార్చుక్రమ సంఖ్య | రాగం | సినిమాలో పాట | సినిమా |
1 | కీరవాణి | పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి | నువ్వు వస్తావని |
2 | కీరవాణి | అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి | ఆరాధన (1987 సినిమా) |
3 | కీరవాణి | చందమామ | గొల్లభామ (సినిమా) |
4 | కీరవాణి | చిలకల కొలికి | అన్వేషణ |
5 | కీరవాణి | ఎదలో లయ | అన్వేషణ |
6 | కీరవాణి | ఎదుటా నీవే ఎదలోనా నీవే | అన్వేషణ |
7 | కీరవాణి | ఎల్లలోకాలకు తల్లివైనీవుండ | బావామరదళ్లు |
8 | కీరవాణి | ఎన్నడికైనా నీ దాననే | చిరంజీవులు (సినిమా) |
9 | కీరవాణి | ఎందుకోయీ తోటమాలీ | విప్రనారాయణ (1954 సినిమా) |
10 | కీరవాణి | ఎన్నెన్నో అందాలు | |
11 | కీరవాణి | గజ్జలు ఘల్లు మంటుంది | సిరిసిరిమువ్వ |
13 | కీరవాణి | జలకాలాటలలో కళకళపాటలలో | జగదేకవీరుని కథ |
14 | కీరవాణి | ఝమ ఝమ ఝమఝం | మల్లీశ్వరి |
15 | కీరవాణి | కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం | స్వయంవరం |
16 | కీరవాణి | కోకిల కోకిల కోకిల | కబడ్డీ కబడ్డీ |
17 | కీరవాణి | కోలోకోలమ్మ గళ్ళ | కొండవీటి దొంగ |
18 | కీరవాణి | మనసు తెలిసిన మేఘమాల | మల్లీశ్వరి |
19 | కీరవాణి | ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ | మువ్వగోపాలుడు |
20 | కీరవాణి | నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా | ప్రాణం (సినిమా) |
21 | కీరవాణి | చంటి | |
22 | కీరవాణి | ఓ ప్రియా ప్రియా | గీతాంజలి (1989 సినిమా) |
23 | కీరవాణి | ఒహ్హోహ్హో పావురమా | స్వర్గసీమ |
24 | కీరవాణి | ఓ పాల లాలీ జన్మకే లాలి | గీతాంజలి (1989 సినిమా) |
25 | కీరవాణి | ఊరుకో హృదయమా | నీ స్నేహం |
26 | కీరవాణి | పతి రూపము నీయ రాయా | బాలరాజు |
27 | కీరవాణి | రండ్రి రండ్రి రండ్రి దయచేయండీ | రుద్రవీణ (సినిమా) |
28 | కీరవాణి | సిరిమల్లె పూవా | పదహారేళ్ళ వయసు |
29 | కీరవాణి | తాళికట్టు శుభవేళా | అంతులేని కథ |
30 | కీరవాణి | వల్లభ ప్రియ వల్లబా | శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ |
31 | కీరవాణి | వినుడు వినుడు రామాయణ గాథా | లవకుశ |