న్యాయాధిపతులు గ్రంథకర్త సమూయేలు ప్రవక్త. ఇది క్రీ.పూ. 1000 సం.ల కాలంలో రాయబడింది. దీనిలో ఇశ్రాయేలు గోత్రాలకు న్యాయం తీర్చిన నాయకులు, వారిచేత దేవుడు జరిపించిన అద్భుతాలు, దేవుని మీద తన ప్రజలు తరచుగా చేసిన తిరుగుబాట్లు, వాటి ఫలితంగా వచ్చిన బాధలు, వారి పశ్చాత్తాపం, దేవుని మహాకరుణ, మొదలగు విషయాలు రాయబడ్డాయి.

న్యాయాధిపతులు
కృతికర్త: ఖచ్చితముగా చెప్పలేము, యూదుల తాల్ముడ్ ప్రకారము సమూయేలు
దేశం: కనాను దేశము
ప్రచురణ:
విడుదల: క్రీ. పూ 1045
ముద్రణ: శ్రీ జయదీప్తి గ్రాఫిక్స్,వినుకొండ
బుక్ ఆఫ్ జడ్జెస్ పుస్తకంలోని ఛాప్టర్ 6-3

పరిచయం

మార్చు

యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు ఎన్నో ఘన విజయాలు అందుకొని కనాను దేశమును ఆక్రమించుకున్నారు. "శత్రువులందరినీ పూర్తిగా నిర్మూలించండి" అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు నిర్లక్ష్యము చేశారు. వారిని తమ ప్రక్కనే ఉండనిచ్చారు. వారిని పెళ్ళి చేసుకొని, బంధువులు అయ్యారు. వారి దేవతలను పూజించి, యెహోవా దేవుని మరచిపోయి విగ్రహారాధన చేసారు. వారి ఆలయాల్లో వ్యభిచారం చేసి, నరబలులు, శిశుబలులు చేశారు. అన్యులతో వ్యాపారము చేసి, ఐశ్వర్యము పొంది, మాకు ఇది చాలు అనుకొన్నారు. దేవుని ధర్మ శాస్త్రమును విసర్జించి, తమ దృష్టిలో ఏది నచ్చితే అది చేశారు.

ఇశ్రాయేలీయుల నైతిక పతనము వారి దేశాన్ని సైనికముగా బలహీనపరచింది. వారి శత్రువులు వారిని మొత్తి బాధపెట్టినప్పుడు, దేవునికి మొర పెట్టారు. దేవుడు వారిని కరుణించి న్యాయాధిపతులను పంపి వారిని విడిపించాడు. యెహోషువ కాలము (క్రీ.పూ 1398) నుండి దావీదు కాలము (క్రీ. పూ 1043) ల మధ్య దాదాపు 350 సంవత్సరాల కాలములో దేవుడు 14 మంది న్యాయాధిపతులను ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. ప్రజలకు విశ్వాసము లేకపోయినప్పుడు కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని వారి పట్ల చూపించాడు.[1]

మూలాలు

మార్చు
  1. "న్యాయాధిపతులు, గ్రంథ పరిచయం: డాక్టర్ పాల్ కట్టుపల్లి". doctorpaul.org (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-12. Retrieved 2020-04-23.