న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) భారత ప్రభుత్వం స్థాపించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని 2019 మార్చి 6 న స్థాపించారు. భారత అంతరిక్ష విభాగం అధీనంలో ఈ సంస్థ ఉంటుంది. ఇస్రో, భారత అంతరిక్ష విభాగాల పరిశోధన ఫలాలను వ్యాపారాత్మకంగా వినియోగించుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించింది. భారత అంతరిక్ష కార్యక్రమపు అవసరాలను తీర్చేందుకు, అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో వ్యాపారాన్ని అందిపుచ్చుకునేందుకూ ఈ సంస్థను ఏర్పాటు చేసారు. ఎన్‌ఎస్‌ఐఎల్ ఏర్పాటు అంతరిక్ష రంగంలోని భారతీయ పరిశ్రమలు ఎదగడానికి, పరిశ్రమలు తమ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికీ దోహద పడుతుంది.[1]
2019 జూలై 5 న లోక్‌సభలో చేసిన బడ్జెట్ ప్రసంగంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంస్థ ఏర్పాటును ప్రస్తావించింది.[2][3]
ఉద్దేశాలు
మార్చుకింది లక్ష్యాలను ఉద్దేశించి సంస్థను స్థాపించినట్లుగా భారత ప్రభుత్వం వెల్లడించింది.[1]
- చిన్న ఉపగ్రహ సాంకేతికతను పరిశ్రమకు బదిలీ చెయ్యడం: అంతరిక్ష విభాగం/ఇస్రో ల నుండి సంస్థ లైసెన్సు పొంది, దాన్ని పరిశ్రమలకు బదిలీ చేస్తుంది.
- చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం తయారీ, ప్రైవేటు రంగ సంస్థల భాగస్వామ్యంతో
- భారత ప్రైవేటు రంగ సంస్థలతో పిఎస్‌ఎల్‌వి ని తయారు చేయించడం
- అంతరిక్షానికి సంబంధించిన సేవలు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగు
- ఇస్రో, ఇతర అంతరిక్ష విభాగపు సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చెయ్యడం
- ఉప సాంకేతికతలు, ఉత్పత్తులు,సేవల మార్కెటింగు - భారత్‌లోను, బయటా
- భారత ప్రభుత్వం ఆదేశించే ఇతర విషయాలేమైనా
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్". ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, భారత ప్రభుత్వం. 24 Jul 2019. Archived from the original on 26 ఆగస్టు 2019. Retrieved 26 Aug 2019.
- ↑ "అంతరిక్ష రంగంలో ఆర్థిక ఫలాలు - ఇస్రో ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక సంస్థ". ఈనాడు. 6 Jul 2019. Archived from the original on 26 ఆగస్టు 2019. Retrieved 26 ఆగస్టు 2019.
- ↑ "బడ్జెట్ 2019: ఎఫ్‌ఎమ్ హైక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఔట్‌లే, పుషెస్ ఫర్ కమర్షియలైజేషన్". బిజినెస్ స్టాండర్డ్. 5 Jul 2019.