నిర్మలా సీతారామన్

భారత ఆర్థిక మంత్రి

నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్‌, అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం.[1]నిర్మలా సీతారామన్‌ 2019 నుండి ఆర్థిక మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[2] వరుసగా ఏడోసారి కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి, మహిళా మంత్రిగా కూడా గుర్తింపు పొందింది. [3]ఆమె 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది.[4][5]

నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్


భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-18) 1959 ఆగస్టు 18 (వయసు 65)
తిరుచిరాపల్లి, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పరకాల ప్రభాకర్ (ఆంధ్రప్రదేశ్)
బంధువులు పరకాల శేషావతారం, పరకాల కాళికాంబ
సంతానం ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి
నివాసం కొత్త ఢిల్లీ, భారత్
పూర్వ విద్యార్థి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
మతం హిందూ

నేపథ్యం

మార్చు

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది.

విద్యాభాస్యం

మార్చు

1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందింది.

రాజకీయ జీవితం

మార్చు

తొలినాళ్లలో లండన్ లోని హాబిట్యాట్ దుకాణం లో పనిచేసింది. ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేసింది. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఈమె దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించింది. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉంది. కేంద్ర సహాయ మంత్రిగా నియమించబడింది. 2014లో ఆంధ్రప్రదేశ్, 2016లో కర్ణాటక నుండి రాజ్యసభకు ఎంపిక అయింది. 2017లో భారత రక్షణ మంత్రిగా పని చేసింది. ఇందిరా గాంధీ తరువాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళా నిర్మలా సీతారామన్. 2019 నుంచి దేశ ఆర్థిక మంత్రిగా నియమితురాలయ్యింది.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె వివాహం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ తో జరిగింది. వీరికి ఒక కుమార్తె పరకాల వాజ్ఞ్మయి. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివాడు.

అభిరుచులు, ప్రత్యేకతలు

మార్చు

ప్రయాణాలు, ట్రెక్కింగ్, సంగీతం. వంట అంటే ఇష్టం. ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తింపు పొందిన శక్తివంతమైన మహిళగా వరుసగా 5 సార్లు నిలిచింది. 2020-21 బడ్జెట్ కోసం 162 నిముషాలు సుదీర్ఘ ప్రసంగం చేసింది. కరోనా కారణం గా ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్నందున విడతల వారీగా అనుబంధ పద్దులను ప్రవేశ పెట్టింది. డిజిటల్ బడ్జెట్ విధానాన్ని తీసుకొచ్చింది. [3]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy. "ప్రపంచంలో ఇప్పటి వరకు రక్షణ మంత్రులుగా పనిచేసిన మహిళలు వీరే..!". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. Sakshi (1 June 2019). "తొలి మహిళా ఆర్థిక మంత్రి". Sakshi. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  3. ఇక్కడికి దుముకు: 3.0 3.1 3.2 రికార్డుల పద్దు నిర్మలమ్మదే. ఈనాడు. 24 జూలై 2024
  4. TV9 Telugu (11 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే." Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.

బయటి లింకులు

మార్చు