వైష్ణవ మతంలోనికి ఇతరులను స్వీకరించేందుకు, వైష్ణవుల పిల్లలు ఉపనయనం జరిగాకా జరిగే సంస్కారాలను పంచ సంస్కారాలని వ్యవహరిస్తారు. హిందూమతంలోని భాగమైన వైష్ణవంలో విష్ణుమూర్తినే ప్రధానదైవంగా మిగతా దేవగణాల కన్నా అధికునిగా భావిస్తారు. 10వ శతాబ్ది నుంచీ తమిళనాట, తెలుగునాట ఆధ్యాత్మిక విప్లవంగా ప్రారంభమైన వైష్ణవం అన్ని కులాలకూ ముక్తిని పొందే హక్కు ఉందని పేర్కొంటూ, కులభేదాలు లేకుండా ముక్తికి యోగ్యులయ్యేందుకు సంస్కారాలను నిర్దేశించింది.[1]

వివిధఅవతారలలో విష్ణువు

సంస్కారాలు మార్చు

మతపరమైన ఐదు సంస్కారాలను పంచసంస్కారాలుగా పిలుస్తారు. అవి:

  1. తాపము: తాప సంస్కారమంటే శ్రీమహావిష్ణువు చిహ్నాలైన శంఖ చక్రాలను అగ్నిలో ఉంచి చెరొక భుజంపై వేస్తారు. దీనివల్ల వ్యక్తి వైష్ణవుడైనట్టు భావిస్తారు.
  2. పుండ్రము: ఊర్థ్య త్రిపుండ్రాలు అన్న పేరుతో సుప్రసిద్ధి పొందిన చిహ్నాన్ని నుదుటిపై ధరిస్తారు. త్రిపుండ్రాలను విష్ణుమూర్తి పాదాలకు చిహ్నంగా భావించి, పుండ్రధారణను సంపూర్ణ శరణాగతికి చిహ్నంగా చెప్తారు.
  3. యజనం: దేవపూజ చేయాల్సి ఉంటుంది.
  4. నామము: జన్మనామమును మార్చి వైష్ణవాంకితమైన పేరును పెట్టాలి.
  5. మంత్రము: మంత్రోపదేశాన్ని స్వీకరించి మంత్రాన్నిచ్చిన గురువుకు శిష్యునిగా మెలగాలి.

ప్రామాణికత మార్చు

ఆళ్వారులు-శ్రీమద్రామానుజుల అనంతర కాలంలో విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ విధానానికి సనాతనమైన వేదాలు మొదలుకొని పురాణాలు మొదలైన ప్రామాణిక గ్రంథాల ఆమోదం ఉన్నట్టుగా పలువురు వైష్ణవ గురువులు, సిద్ధాంతకర్తలు ప్రవచించేవారు. శ్రుతుల(వేదాల)లోని ప్రమాణాలు, స్మృతుల్లోని ప్రమాణాలు, పురాణాల్లోని ప్రమాణాలు మొదలైనవి కొన్ని గ్రంథాల్లోనూ, పూర్వం ఉపన్యాసాల్లోనూ వివరించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే-అనంతుడు, గరుడుడు, విష్వక్సేనుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవగణాలు, పితృదేవతాగణాలు, మరుత్గణాలు, మునులైన వశిష్టుడు, కాశ్యపుడు, యాజ్య్ఞవల్క్యుడు మొదలైన పలువురు చక్రాంకితులని కొన్ని ప్రమాణాలను చూపారు. మొత్తంగా చక్రాంకికత వంటి పంచసంస్కారాలకు వేదాల నుంచి మొదలుకొని ఎన్నో మత గ్రంథాలలో ప్రమాణాలన్నట్టు, పూర్వం దేవతలు, ఋషులు మొదలైన మార్గదర్శకులు చక్రాంకితులైనట్టు కొన్ని గ్రంథాల్లో రచించారు.[1]

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తప్తచక్రాంకన ప్రమాణములు:1971