పంజాబ్ అన్నది భారత ఉపఖండంలో పశ్చిమ పంజాబ్ (పాకిస్తాన్), తూర్పు పంజాబ్ (భారతదేశం)ల నడుమ విభజితమైన ప్రాంతం. పంజాబీ సంగీతం విస్తారమైన విభిన్న శైలిని కలిగివుంది. వీటిలో జానపద సంగీతం నుంచి హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం వరకూ ఉన్నాయి. హిందుస్తానీ సంగీతంలో ఇక్కడి వైవిధ్యభరిత రూపాన్ని పటియాలా ఘరానా అని పిలుస్తారు.

A Lady Playing the Tanpura, ca. 1735.jpg
తంబురా వాయిస్తున్న మహిళ . 1735

పంజాబీ జానపద సంగీతం మార్చు

పంజాబ్ జానపద సంగీతం అన్నది పంజాబ్ లో సంప్రదాయికంగా సంప్రదాయ వాద్యాలైన తుంబీ, అల్గోజ్, ఢద్, సరంగీ, చిమతా, తదితరాలను ఉపయోగించి చేసే సంగీతం. పుట్టుక నుంచి మరణం వరకూ పెళ్ళి, పండుగలు, జాతరలు, మతపరమైన కార్యక్రమాలు వంటి ప్రతీ ఘట్టానికి తగ్గ జానపద గీతాలు విస్తారంగా ఉన్నాయి.

జానపద సంగీతాన్ని సాధారణంగా పంజాబ్ సంప్రదాయ సంగీతంగా పరిగణిస్తారు, ఈ పాటలకు సామూహిక కర్తృత్వం ఉంటుంది. కాలానుగుణంగా సంగీతంలోని జానపద లక్షణం మారుతూన్నా జానపద సంగీతపు పాత విభాగాలు సామూహిక కర్తృత్వంతో ఉన్నాయి. దాదాపు ప్రతీ వివాహంలోనూ కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రొఫెషనల్ సంగీతకారులు పలు జానపద గీతాలు ఆలపిస్తూ ప్రదర్శనలు చేస్తారు, వీటిలో జ్ఞాపకం లాంటి గతానికి చెందినవే, ప్రస్తుత కాలంలోని విరహం, సంబరం, భయం, ఆశ వంటివి వినిపిస్తూంటాయి.[1]

భక్తి సంగీతం మార్చు

సూఫీ సంగీతం మార్చు

పలు విధాలైన సూఫీ సంగీతం సూఫీ కవిత్వాన్ని ఆలపించేదిగా ఉంటుంది. బాబా ఫరీద్, బల్లే షా, షా హుస్సేన్, వారిస్ షా, మియాన్ మహమ్మద్ బక్ష్ వంటి సూఫీ కవుల కృతులు గానం చేస్తూంటారు.

సిక్ఖు సంగీతం మార్చు

సిక్ఖు భజనలు సంగీతం వంటివి చేస్తూంటారు.

పంజాబీ పాప్ మార్చు

పంజాబీ పాటలు ఇటీవలి సంవత్సరాల్లో బాలీవుడ్ పాటల్లో చేరి భారతీయ సంస్కృతి ప్రధాన స్రవంతిలోనే కాక యుకె, యుఎస్ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. తూర్పు, పశ్చిమ పంజాబ్ ప్రాంతాల వారు అధిక సంఖ్యలో 1970ల్లో యుకె చేరుకున్న దక్షిణాసియా డయాస్పోరా కారణంగా లండన్, సౌతాల్ వంటి ప్రాంతాల్లో పంజాబీ సంగీత ప్రాచుర్యం పెరిగింది. 1980ల నుంచి భాంగ్రా అంటూ పిలిచే విభాగంతో సహా పలు విధాల పంజాబీ సంగీతం డిస్కోల్లో వినిపించడం ప్రారంభమైంది.[2]

ప్రధాన స్రవంతి హిందీ సినిమాలో పంజాబీ సంగీతం తన ముద్ర వేసింది. ఇది పంజాబీల వేడుకలకు జాతి సాంస్కృతిక గుర్తింపుగానూ, మరీ ఇటీవల వేడుకలకు జాతీయ గుర్తింపుగా పేరొందింది.[3]

మూలాలు మార్చు

  1. Myrvold, Kristina (2004). "Wedding Ceremonies in Punjab" (PDF). Journal of Punjab Studies. 11 (2): 155–170. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-07-19.
  2. Schreffler, Gibb (2012). "Migration Shaping Media: Punjabi Popular Music in Global Historical Perspective". Popular Music and Society. 35 (3): 333–358. doi:10.1080/03007766.2011.600516.
  3. Roy, Anjali Gera. (2010) Bhangra Moves: From Ludhiana to London and Beyond. London: Ashgate. ISBN 0754658236. pp. 129–174.