పంజాబ్ క్రికెట్ జట్టు (పాకిస్థాన్)
పాకిస్థాన్ కు చెందిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు
పంజాబ్ క్రికెట్ జట్టు అనేది పాకిస్థాన్ కు చెందిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు.[1] ఇది పంజాబ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహింస్తోంది. పంజాబ్ జట్లు 1953-54 నుండి 1957-58 వరకు క్వాయిడ్-ఐ-అజామ్ ట్రోఫీలో ఆడాయి. తర్వాత 1972-73 నుండి 1978-79 వరకు పెంటాంగ్యులర్ ట్రోఫీ, క్వాయిడ్-ఐ-అజామ్ ట్రోఫీలో, తర్వాత 2007–08 నుండి 2011–12 వరకు పెంటాంగ్యులర్ కప్‌లో ఆడాయి. వారు ప్రారంభ 2008–09 పెంటాంగ్యులర్ వన్ డే కప్‌ను కూడా గెలుచుకున్నారు.
పంజాబ్ క్రికెట్ జట్టు
క్రీడ | క్రికెట్ |
---|---|
దేశం | పాకిస్తాన్ |
పంజాబ్‌తోపాటు పంజాబ్ ఎ, పంజాబ్ బి, పంజాబ్ గ్రీన్స్, పంజాబ్ వైట్స్ కూడా క్వాయిడ్-ఐ-అజం ట్రోఫీకి పోటీ పడ్డాయి. పంజాబ్ 1956–57లో ట్రోఫీని, 1974–75లో పంజాబ్ ఎ జట్టు గెలిచింది, 2011–12లో పంజాబ్ పెంటాంగ్యులర్ కప్‌ను గెలుచుకుంది.
మూలాలు
మార్చు- ↑ "Central Punjab (Pakistan) Team | CPNJB | Match, Live Score, News". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-01-17.