పంజాబ్ విద్యా వ్యవస్థ

2011 భారతదేశ గణాంకాల ప్రకారం పంజాబ్ లో అక్షరాస్యత 75.84 శాతం. ఇందులో మగవారిలో 80.44 శాతం కాగా ఆడవారిలో 70.73 శాతంగా ఉంది. [1] 2015 గణాంకాల ప్రకారం పంజాబ్ లో 920 ఎంబీబీఎస్ సీట్లు, 1070 డెంటల్ సీట్లు ఉన్నాయి. [2] అమృత్ సర్, ఫరీద్ కోట్, పటియాలాలో ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి.

పంజాబ్ లో తరగతి గది

విశ్వవిద్యాలయాలు

మార్చు
 
పంజాబ్ విశ్వవిద్యాలయం

పంజాబ్ లో క్రింద పేర్కొన్న విధంగా ఉన్నత విద్యనందించే అనేక సంస్థలున్నాయి. ఈ సంస్థలు కళలు, సైన్సు, ఇంజనీరింగ్, న్యాయవిద్య, వ్యవసాయ విద్య, వ్యాపారం లాంటి అనేక రంగాలలో కోర్సులు అందిస్తున్నాయి. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1960-70 లో హరిత విప్లవంలో తనవంతు కృషి సల్పింది.

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు

మార్చు
  • పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, బటిండా
  • పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్
  • బాబా ఫరీద్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఫరీద్ కోట్
  • గురునానక్ దేవ్ విశ్యవిద్యాలయం, అమృత్సర్
  • పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూధియానా
  • ఐ.కె. గుజ్రాల్ పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, జలంధర్
  • మహారాజా రంజిత్ సింగ్ రాష్ట్రీయ సాంకేతిక విశ్వవిద్యాలయం, బటిండా
  • పంజాబీ విశ్వవిద్యాలయం, పాటియాలా
  • గురు రవిదాస్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం, హోషియాపూర్
  • గురు అంగద్ దేవ్ పశువైద్య విశ్వవిద్యాలయం, లూధియానా
  • రాజీవ్ గాంధీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, పాటియాలా

పంజాబ్ లో చదివిన ప్రముఖులు

మార్చు
 
మన్మోహన్ సింగ్
  • భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆక్స్ ఫర్డ్ లో చదవడానికి మునుపు చంఢీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదివాడు.
  • ప్రముఖ జీవసాంకేతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయిన హరగోవింద్ ఖురానా పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదివాడు.
  • బి.జె.పికి చెందిన ప్రముఖ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదివింది.

మూలాలు

మార్చు
  1. భారత, ప్రభుత్వం. "పంజాబ్ జనాభా లెక్కలు 2011". census2011.co.in. భారత ప్రభుత్వం. Retrieved 23 July 2016.
  2. "Admissions for PMET 2015 on hold, High court issues notices". hindustantimes.com/. 10 September 2015. Archived from the original on 13 సెప్టెంబరు 2015. Retrieved 10 September 2015.