భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణకు ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులనువాడి, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా హరిత విప్లవం (Green Revolution) అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా మెక్సికోలో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది.

హరిత విప్లవంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యవసాయాభివృద్ధి

భారతదేశంలో

మార్చు

మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. 1961 లో భారతదేశంలో విపరీతమైన క్షామం ఏర్పడింది. అప్పటి భారతదేశపు వ్యవసాయశాఖా మంత్రియైన ఎం.ఎస్.స్వామినాథన్ సలహాదారు నార్మన్ బోర్లాగ్ ను భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశ ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. దాంతో భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది.

ఎం.ఎస్.స్వామినాథన్, పి.సుబ్రమణ్యంలను భారతదేశపు హరిత విప్లవ పితామహులుగా అభివర్ణిస్తారు.

హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు. హరిత విప్లవాన్ని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావం వల్ల గోధువుల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ కోవకు చెందినవే మరి కొన్ని విప్లవాలున్నాయి. అవి.

  • పింక్ రెవల్యూషన్ = ఉల్లి, ఔషదాలు, రొయ్యలు మొదలగు వాటి ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవము.
  • బ్లూ రెవల్యూషన్ = చేపల ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవము.
  • బ్లాక్ రెవెల్యూషన్ = పేట్రోలియం ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవము.
  • రౌండ్ రెవల్యూషన్ = బంగాళా దుంపల అధిక దిగుబడికొరకు ఉద్దేశించిన విప్లవము.
  • రెడ్ రెవల్యూషన్ = మాంసం టమోటాల ఉత్పత్తుల కొరకు.
  • బ్రౌన్ రెవల్యూషన్ = తోళ్లపరిశ్రమ అభివృద్ధిం సంప్రదాయ ఇందన వనరుల అభివృద్ధి.
  • వైట్ రెవల్యూషన్ = పాలు, పాల ఉత్పత్తుల అభివృద్ధికి ఉద్దేశించింది.
  • యెల్లో రెవల్యూషన్ = నూనె గింజల ఉత్పత్తుల అభివృద్ధికి ఉద్దేశించింది.
  • గోల్డన్ రెవల్యూషన్ = తేనె, పండ్లు, ఉద్యాన వనాల అభివృద్ధికి ఉద్దేశించింది.
  • సిల్వర్ రెవల్యూషన్ = గ్రుడ్లు, పౌల్ట్రీ అభివృద్ధికి ఉద్దేశించింది.
  • గోల్డెన్ పైబర్ రెవల్యూషన్ = జనపనార ఉత్పత్తుల అభి వృద్ధికి ఉద్దేశించింది.

బాల భారతం పత్రిక. అగస్టు 2015