పంజీరి పాకిస్తాన్, భారతదేశంలో గల పంజాబ్ ప్రాంతాలలోని వంటకం.[1] దీనిని పోషక పదార్థంగా భావిస్తారు. ఇది గోధుమ పిండిని నెయ్యి, పంచదారలో కలిపి తయారుచేస్తారు. దీనిలో ఎండు పండ్లను వేస్తారు. సహజమైన హెర్బల్ గమ్స్ ను కలుపుతారు. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దీనిని శీతాకాలంలో జలుబు చేసినపుడు ఔషథంగా తీసుకుంటారు. ఈ పంజీరి ని చంటిపిల్లలను పోషించే తల్లులకు వాడుతారు. ఈ పదార్థం చనుబాలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తారు.

పంజీరి
పంజీరి
మూలము
మూలస్థానంపాకిస్తాన్ యొక్క పంజాబ్ ప్రాంతం
వంటకం వివరాలు
వడ్డించే విధానంభోజనానికి
ప్రధానపదార్థాలు గోధుమ పిండి, పంచదార, నెయ్యి, ఎండిన పండ్లు, హెర్బల్ గమ్స్.

ఈ పదార్థాన్ని వేల సంవత్సరముల నుండి హిందువులు వాడుతున్నారు. కొన్ని శతాబ్దముల తరువాత సిక్కులు కుడా ఎక్కువగా వాడేవారు. దీనిని గర్భం సమయంలో సాధ్యమైనంత వరకు ఆచారంగా వాడుతారు.

పదార్థాలు

మార్చు
  • గోధుమ పిండి
  • నెయ్యి
  • చార్ మగజ్
  • పంచదార
  • బాదం
  • ఆహార- గం స్పటికాల చూర్ణం
  • ప్లేం ఆఫ్ ద పారెస్ట్ (కమార్కస్)
  • సాన్ఫ్
  • కలువ విత్తనాలు
  • కేరం విత్తనాలు (ajwain)
  • కార్డమం విత్తనాల చూర్ణం (elaichi)
  • ఎండు అల్లం చూర్ణం (saunth)
  • వాల్నట్ (akhrot)
  • పిస్తా పప్పు (pista)
  • పంచదార పౌడరు (boora)

తయారీ విధానం

మార్చు
  • పెద్ద కళాయిలో 500 గ్రాముల నెయ్యిని వేడిచేయాలి.
  • ఎండు పండ్లన్నింటిని ఒకదాని తరువాత ఒకటి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. మొదట ఆల్మండ్, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తాపప్పు, కలువ విత్తనాలు, మెలన్ విత్తనాలను వరుసగా వేయించారు. వీటిని కిచెన్ పేపరుపై కొంతసేపు వాటికి గల అధికంగా నూనె ఆరే వరకు ఉంచాలి.
  • అదే నెయ్యిలో కమార్కస్ లను వేయించి దానికి ఉంచుకోవాలి.
  • తరువాత తరిగిన కొబ్బరి కోరును వేయించి ఉంచుకోవాలి.
  • తరువాత మెలన్ విత్తనాలు తప్ప వేయించిన అన్ని ఎండు పండ్లను పౌడరు చేయాలి. దానికి వేయించిన కొబ్బరి కోరు, మెలన్ విత్తనాలను కలపాలి దానిని పెద్ద పాత్రలో ఉంచుకోవాలి. కమార్కస్ ను కూడా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి.
  • మిగిలిన నెయ్యిని వేడిచేసి తక్కువ వేడితో పిండిని వేయించాలి. ఆ పిండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి. తరువాత నెయ్యిని వేరుచేయాలి.
  • వేడి సెగను తగ్గించి దానిలో గం స్పటికాలను చల్లాలి. వాటిని బాగా కలియబెట్టాలి.
  • సాంత్ పౌడరు, అజ్వాన్ పౌడరులను వేయించిన పిండికి కలిపు దానిని అన్ని పదార్థాలు బాగా కలిసే వరకు కలియబెట్టాలి.
  • మంటను తగ్గించాలి. ఈ మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాలు ఉంచాలి.
  • దానికి ఎండి పండ్లను, మాగాజ్, పంచదార, కామార్కస్ లను కలపాలి. ఈ పదార్థాన్ని పెద్ద డిష్ లో ఉంచి చల్లబరచాలి.
  • గాలి చొరని పాత్రలో ఈ మిశ్రమాన్ని భద్రపరచాలి.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పంజీరి&oldid=2990565" నుండి వెలికితీశారు