పండుగలు - పరమార్థములు


పండుగలు - పరమార్థములు హిందూ పండుగల గురించిన విశేష ప్రాముఖ్యత కలిగిన పుస్తకము. దీనిని ఆండ్ర శేషగిరిరావు రచించారు, తిరుమల తిరుపతి దేవస్థానములు 2005 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించారు.

పండుగలు - పరమార్థములు
పండుగలు-పరమార్ధములు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఆండ్ర శేషగిరిరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: వివిధ పండుగల గూర్చి
ప్రచురణ: తిరుపతి తిరుమల దేవస్థానములు
విడుదల: 2000
ముద్రణ: సత్యం అఫ్‌సెట్ ప్రింటర్స్, విశాఖపట్నం

విశేషాలు

మార్చు

లోక సంక్షేమాన్ని ఆశించిన పూర్వఋషులు, నక్షత్రగమనాన్ని బట్టి, ఋతుధర్మాన్ని బట్టి ఈ పండుగల నన్నింటినీ ఏర్పరచారు. మానవుడు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా జీవించడానికి ఏయే ఋతువుల్లో ఏయే రకాల క్రియాకలాపాలు చేయాలి. ఏయే పదార్ధాలు సేవించాలి అనే విషయాలన్ని పండుగలలో ఆచారాల రూపంలో స్థిరపరచి తమ సంతతికి అందించారు. కొన్ని పండుగలు ఆయా ప్రదేశాల శీతోష్ణస్థితిగతుల్ని పట్టి ఏర్పడ్డాయి. కొన్ని ఆయాసామాజిక జీవన విధానంలోంచి పుట్టుకొచ్చాయి. వ్రతాలు, నియమాలు ఇవన్నీ మానవుడికి ఒక సంస్కారాన్ని అలవరచాయి. ఆయా నియమాలు మానవులకు ఆరోగ్యప్రదాలుగా పరిణమించాయి. ఎన్నెన్నో వ్రతగ్రంధాలు వ్రాసిపెట్టారు ఋషికల్పులయిన మన పెద్దలు. ఈపండుగలు మన సంస్కృతికి దర్పణాలు.

పండుగల సందర్భంలో ఆయా పండుగల గురించి ఆండ్ర శేషగిరిరావు వ్యాసాలు వ్రాసి ప్రచురిస్తూ ఉండేవారు. అతను పండుగల గురించిన విషయాలన్నీ సేకరించి ఉంచారు. . వారు పరిశీలించిన గ్రంథాలు ప్రధానంగా - నీలమతపురాణం, స్మృతికౌస్తుభం, చతుర్వర్గ చింతామణి, గదాధర పద్ధతి, పురుషార్ధ చింతామణి, ధర్మసింధువు, నిర్ణయసింధువు, వ్రతోత్సవచంద్రిక, తిధితత్త్వము, స్మృతిదర్పణము, పురాణనామచంద్రిక, అమాదేర్ జ్యోతిషీ, హిందువుల పండుగలు, ఆయా పత్రికల్లోని వివిధ వ్యాసాలు.

ఇంతకృషి చేసి సేకరించిన విషయాన్ని క్రోడీకరించి ప్రచురించడం కనీస బాధ్యతగా భావించి ఆమె కుమార్తె కోలవెన్ను మలయవాసిని ఈ పుస్తకానికి ఒక రూపాన్ని ఇచ్చి అచ్చు వేయించింది.

తెలుగు వారి ఈ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాల వారికి అందించాలనే తపనే ఈ పుస్తకం ముద్రించడానికి కారణం.[1]


మూలాలు

మార్చు
  1. "పుట:PandugaluParamardhalu.djvu/4 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-09.