పండూరివారి మామిడి

పండూరివారి మామిడి చాలా పురాతనమైన నాటు మామిడి కాయ రకం. దీని శాస్త్రీయ నామం 'మాంగిఫెరా ఇండికా' లేదా 'స్పాండియాస్ మాంగిఫెరా' అయివుండవచ్చును. ఈ రకం మామిడి చెట్లు సుమారుగా 100 అడుగులు ఎదుగుతాయి, 300 సంవత్సరాలు జీవించగలవు. వీటి కాండం చుట్టుకొలత 12 నుండి 14 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్లని చెప్పవచ్చు. ఈ రకం మామిడి చూడడానికి కూరల్లో, పప్పుల్లో వేసుకొనే మామిడి కాయ వలే చిన్నగా ఉంటుంది. రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. పండూరివారి మామిడి ఇతర మామిడి రకాలవలే మగ్గే సమయంలో రంగు రాదు. ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా లో తణుకు వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరివారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయల ఋతువు పండూరివారి మామిడితోనే మొదలవుతుంది.

మాంగిఫెరా ఇండికా

చరిత్ర మార్చు

పూర్వం ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచుకొనేవారు. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టుకునేవారు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామ పరిసర ప్రాంతాలలో పురాతన పండూరివారి మామిడి చెట్టు ఉండేది. దీని ఆవిర్బావం గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం దొంగలు ఒక ఉద్యానవనం నుండి మామిడి కాయను దొంగిలించి వెలగదురు ప్రాంతంలో టెంకను పాతారు. ఆ తల్లి చెట్టు మరణించే సమాయానికి దాని నుండి చాలా అంట్లు కట్టుట జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు. అయితే పండూరివారి మామిడి రకం పుట్టు పూర్వోత్తరాలు, నామ ధేయ పూర్వోత్తరాలు మాత్రం లభ్యం కాలేదు.

ప్రస్తుత పరిస్థితి మార్చు

ఇటీవల పండూరివారి మామిడి జాతి అంతరించిపోవుచున్నది. అయితే ఈ జాతిని కాపాడటం కోసం ఫారెస్టు డిపార్టుమెంట్ వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో నర్సరీల వారు పండూరివారి మామిడి అంట్లను కట్టి అమ్ముతున్నారు. అంట్ల విధానం (గ్రాఫ్టింగ్ ) వల్ల నేడు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా చోట్ల పండూరివారి మామిడి చెట్లు విస్తరించాయి.

ఇంకా చదవండి మార్చు

బయట లింకులు మార్చు