పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై

భరతనాట్య కళాకారుడు, నాట్య గురువు

పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై భరతనాట్య విద్వాంసుడు, నాట్యాచార్యుడు.

పందనల్లూర్ చొక్కలింగం సుబ్బరాయ పిళ్ళై
వ్యక్తిగత సమాచారం
జననం(1914-12-07)1914 డిసెంబరు 7
పందనల్లూర్, తంజావూరు జిల్లా
మూలంతంజావూరు
మరణం2008 మే 12(2008-05-12) (వయసు 93)
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం నృత్యకారుడు, నాట్యగురువు

విశేషాలు సవరించు

ఇతడు 1914, డిసెంబర్ 7వ తేదీన పి.చొక్కలింగం పిళ్ళై, సెంగమ్మాళ్ దంపతులకు తమిళనాడు రాష్ట్రం, తంజావూర్ జిల్లా, పందనల్లూర్ గ్రామంలో జన్మించాడు. ఇతడు, ఇతని తండ్రి పి.చొక్కలింగం పిళ్ళై, తాత మీనాక్షి సుందరం పిళ్ళై కలిసి భరతనాట్యంలో పందనల్లూర్ బాణీని ప్రవేశపెట్టారు.

ఇతడు తన తాత మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యం అభ్యసించాడు. తరువాత తండ్రితో కలిసి మద్రాసులో భరతనాట్యం గురువుగా అనేక మంది శిష్యులను కళాకారులుగా తయారు చేశాడు. ఇతని తండ్రి మరణించిన తర్వాత కూడా ఇతడు గురువుగా తన వృత్తిని కొనసాగించాడు.

ఇతనికి భార్య రుక్మిణీ అమ్మాళ్ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతడు తన ఇద్దరు మనుమరాళ్ళు జి.వసుమతి, జి.వనితలకు శిక్షణనిచ్చి నృత్య కళాకారిణులుగా తయారు చేశాడు. ఇతని శిష్యురాళ్ళలో అలర్మేల్ వల్లి, మీనాక్షి చిత్తరంజన్ మొదలైనవారున్నారు.[1]

పురస్కారాలు సవరించు

ఇతడు అనేక పురస్కారాలను అందుకున్నాడు. వాటిలో కొన్ని:[2]

  • సంగీత నాటక అకాడమీ అవార్డు (1979)
  • కళైమామణి (1979)
  • నాట్యాచార్య అవార్డు (1995) - మద్రాసు సంగీత అకాడమీ
  • నృత్య పెరనాయర్ బిరుదు - నృత్యాంజలి, చిదంబరం
  • వెటరన్ గురు అవార్డ్ - నాట్యరంగం
  • నాట్యకళానిధి అవార్డ్ (2006) - అసోసియేషన్ ఆఫ్ భరతనాట్యం ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా (ABHAI)

ఇతడు తన 94వ యేట 2008 మే 12వ తేదీన మరణించాడు.

మూలాలు సవరించు

  1. web master. "OBIT: Dance guru Pandanallur Subbaraya Pillai". KUTCHERI BUZZ. Retrieved 13 April 2021.
  2. Jyoti Mohan (Oct–Dec 2013). "Pandanallur Subbaraya Pillai- A Centenary Tribute". Shanmukha A cultural Journal. 40 (4): 4. Retrieved 13 April 2021.{{cite journal}}: CS1 maint: date format (link)