భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "తంజావూరు"లో 'నట్టువన్నులు', దేవదాసీలు ఈ కళకు పోషకులు. భావం, రాగం, తాళం - ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి.

ఒక భరతనాట్య నర్తకి

విధానం

మార్చు
 
భరతనాట్య ప్రదర్శన
 
భరతనాట్య ప్రదర్శనలో ఓ సన్నివేశం

నాట్య శాస్త్రంలో ఇలా చెప్పబడింది (అ.44), "..నీలకంఠుడు (శివుడు) కైశికీ పద్ధతిలో నృత్యం చేస్తుండగా నేను చూచాను. ఆ నృత్యంలో విస్తృతమైవ భంగిమలు (మృదు అంగహారాలు, చేతులు, కాళ్ల కదలికలు), (రసములు), (భావములు) ఉన్నాయి. ఆ నృత్యం యొక్క ఆత్మ (క్రియలు). ధరించే వస్త్రాలు అత్యంత మనోహరంగా ఉండాలి. (శృంగారమే) ఆ నృత్యానికి మూలం. 'మగవారికి ఆ నృత్యం నరిగా చేయడం సాధ్యం కాదు.' ఆడవారు తప్ప వేరెవరు దానిని సరైన విధానంలో చేయలేరు

పుట్టుక

మార్చు

భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, ప్రస్తుతం వాడుకలో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి, అమలు పరచిన వారు తంజావూర్ కి చెందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు. వీరు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ మీనాక్షి సుందరం పిళ్ళై వీరి వారసులే. ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి, సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు రుక్మిణీదేవి అరండేల్. ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో "కళాక్షేత్ర" అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు.

బయటి లింకులు

మార్చు

వెబ్‌లో దృశ్యశ్రవణ వనరులు

మార్చు