పంపానది

(పంబ నుండి దారిమార్పు చెందింది)

పంపానది ( కేరళలో దీనినే పంబానది అని కూడా అంటారు) ఈ నది ఎందరో హిందువులకు ఎంతో పుణ్యపావని. ఇందులో స్నానమాచరిస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శబరిమలై క్షేత్రానికి దగ్గరలోనే ప్రవహిస్తున్న ఈ నది అంటే అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్ర భావన ఉంది. అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ముందే ఈ నదిలో స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తోంది. శబరి క్షేత్రానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఈ నది పవిత్రత తెలుసు.[1]

పంపానది (Pampa River : പമ്പ നദി)
Labelled map of Pamba
స్థానం
దేశంభారత దేశం
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంPulachimalai
 • ఎత్తు1,650 మీ. (5,410 అ.)
సముద్రాన్ని చేరే ప్రదేశం 
 • స్థానం
Vembanad Lake & Thottappally Spillway
పొడవు176 కి.మీ. (109 మై.)
పరీవాహక ప్రాంతం2,235 కి.మీ2 (863 చ. మై.)
ప్రవాహం 
 • సగటు109 m3/s (3,800 cu ft/s)
Pamba River

కేరళకే తలమానికం పంపానది

మార్చు

శబరిమలై దగ్గర ఈ పంపానది తీరానే అయ్యప్ప స్వామి కొలువుదీరి ఉన్నాడు. కేరళరాష్ట్రంలో పెరియార్ నది పెద్దది. తరువాతి స్థానం పంపానదిదే. తిరువాన్కూరు జిల్లాగుండా పత్తనమిట్ట, చెంగన్నూరు, కుట్టనాడ్, అంబలపూజ, అయైరూర్ల గుండా ఈ నది ప్రవహిస్తోంది.

ఈ నదిని దక్షిణ భాగీరథి అనీ, రివర్ బాంప్ అనీ కేరళీయులు పిలుస్తారు. అజ్ తుయార్, కక్కియార్, కక్కత్తర్, వరత్తార్, కుట్టెయ్ పేరూర్ అనేవి పంపాకు ఉపనదులుగా ఉన్నాయి. ఈ నదీ తీరంలో ఉన్న అంజనాదేవాలయం ఎంతో ప్రసిద్ధమైంది.

పెరియార్ నది

మార్చు

పెరియార్ నది దక్షిణభారత దేశపు జీవనదిగా కొనియాడబడుతోంది. ఈ నది కేరళలో చాలా పట్టణాల దాహర్తిని తీరుస్తోంది. పెరియారు అంటే పెద్దది అని అర్థం. ఇది పడమటి కనుమలలో శివగిరి అడవులలో దేవి కోలమ్ కొండలలో పుట్టింది. పెద్దనది పేరున్న ఈ నది పొడవు మాత్రం 244 కి.మీ.మాత్రమే. ఇది ఉత్తరంగా ప్రవహించడం మొదలుపెట్టి పశ్చిమంగా మళ్లుతుంది. అలా కొంత దూరం ప్రవహించాక రెండుపాయలుగా విడిపోతుంది. ఒక పాయ పల్లిపురం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుండగా, మరోపాయ ఎర్నాకుళం దగ్గరం కలుస్తుంది. ఈ నదీతీరంలో అలువా అనే చిన్న పట్టణంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అద్వైతమత స్థాపకుడు శ్రీఆదిశంకరాచార్యులు జన్మించిన కాలడి గ్రామం ఈ నది తీరానే ఉంది. ఈ పెరియార్ నదిని అక్కడ పూర్ణానదిగానూ పిలుస్తారు.

మూలాలు

మార్చు
  1. "Temple plans to challenge ban on throwing clothes in Pamba river". Mathrubhumi (in ఇంగ్లీష్). 21 November 2015. Retrieved 2019-11-18.
"https://te.wikipedia.org/w/index.php?title=పంపానది&oldid=3914850" నుండి వెలికితీశారు