పక్కయింటి అమ్మాయి

(పక్కింటి అమ్మాయి (1953 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

నవరసాల్లో హాస్యానికి సముచిత స్థానంలో ఉంచిన తెలుగు సినిమా పక్కయింటి అమ్మాయి. బెంగాలీలో సుధీర్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన 'పాషేర్ బరీ' ఈ చిత్రానికి ఆధారం. తరువాత' పడో'సన్ పేరుతో హిందీలో నిర్మించారు. తరువాత తెలుగులో కె.వాసు దర్శకత్వంలో పక్కింటి అమ్మాయి (1981) ని మళ్ళీ నిర్మించారు.

పక్కయింటి అమ్మాయి
(1953 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో పక్కయింటి అమ్మాయి ప్రకటన
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం అంజలీదేవి,
రేలంగి,
సి.యస్.రావు,
ఏ.యమ్.రాజా
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిలిం కంపెనీ
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

అనగనగా ఒక చదువురాని ఓ బడుద్దాయి, పేరు సుబ్బారాయుడు (రేలంగి). అతని ఇంటిపక్కనే వుంటుంది కథానాయిక (అంజలీదేవి). ఆమెకు నాట్యం అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నృత్యరీతుల కనువుగా సంగీతాన్ని చెప్పే మాస్టార్ని (అడ్డాల నారాయణరావు) పెట్టుకుంటుంది. పక్కింట్లో నివసించే సుబ్బారాయుడు చేష్టలు ఆమెకు నచ్చవు. ఆమెపై మనసు పారేసుకొన్న సుబ్బారాయుడు తన మిత్రబృందం సభ్యుల సలహామేరకు తనకు సంగీతం వచ్చినట్లు ఫోజు పెడతాడు. ఆమె తన గురువును సుబ్బారాయుడి మీదకు ఉసిగొల్పుతుంది. సుబ్బారాయుడు తన గురువు సలహమేరకు మరో మిత్రుడు (ఏ.యం.రాజా) పాట పాడుతుంటే దానికి తగ్గట్టు పెదాలు కదుపుతూ సుబ్బారాయుడు అద్భుతంగా అభినయిస్తాడు. దాంతో కథానాయిక కూడా సుబ్బారాయున్ని ప్రేమించేదాకా వస్తుంది. అయితే అసలు గాయకుదు రాజా అని, సుబ్బారాయుడు కాదని తెలుసుకున్న నాయిక తన మనసు మార్చుకుంటుంది. సుబ్బారాయున్ని రక్షించుకోవడానికై మిత్రులు పన్నిన వ్యూహంలో భాగంగా సుబ్బారాయుడు చచ్చినట్లు నటిస్తాడు. కథానాయిక మనసు మార్చుకొని సుబ్బారాయుడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

మూలాలు

మార్చు