పక్షుల పండుగ వివిధ ప్రాంతాలలోని వలస పక్షుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియ జేసేందుకు నిర్వహించే పండుగ. డార్జిలింగ్ వన్యప్రాణి విభాగం 2023 ఫిబ్రవరి 20 నుండి 23 వరకు 1వ మహానంద పక్షుల పండుగను నిర్వహించారు.[1]

ఆంధ్ర ప్రదేశ్

మార్చు

నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటకు దగ్గరలోని నేలపట్టు దగ్గర ఉన్న పులికాట్ సరస్సు దేశంలో ఉన్న పెద్ద సరస్సులలో రెండవది. సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది. ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడకి ఎన్నో రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఇలా వచ్చిన పక్షులు ఇక్కడే తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి తమ గమ్య స్థానానికి వెళ్ళిపోతుంటాయి. ఎంతో ప్రాధాన్యత గల ఈ విషయాన్ని ప్రజలందరికి తెలియటం కోసం ప్రభుత్వంవారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో పక్షుల పండుగ పేరుతో ప్రముఖులను ఆహ్వానించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 2018 2018 జనవరి 7,8,9 తేదీల్లో ఎపి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరిగింది[2].

ఛత్తీస్ గఢ్

మార్చు

ఛత్తీస్ గఢ్ లో మొదటిసారిగా 2021 జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు మూడురోజులు గిడ్వా, పరసాడ గ్రామాలలో పక్షుల పండుగ జరిగింది. [3]

థాయిలాండ్

మార్చు

థాయ్‌లాండ్‌లో ఏటా సెప్టెంబర్‌లో పక్షుల పండుగ నిర్వహిస్తారు. వేలాది పక్షులను పంజరాల్లో ఉంచి అక్కడ ప్రదర్శిస్తారు. 2017లో దాదాపు 1400 రకాల పక్షులు కనువిందు చేశాయి. వరుసగా పోల్స్‌పాతి వాటికి పంజరాలను అమర్చి ఈ వేడక నిర్వహిమారు[4].

మూలాలు

మార్చు
  1. "First bird fest at Mahananda sanctuary from Feb 20". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-01-18. Retrieved 2023-04-29.
  2. Suvarnaraju (2018-01-07). "పక్షుల పండుగ 2018...ప్రముఖుల సందడి...వెరసి కన్నులవిందు...ఎక్కడంటే..." https://telugu.oneindia.com. Retrieved 2023-04-29. {{cite web}}: External link in |website= (help)
  3. "First Bird Festival of Chhattisgarh, District- Bemetara | District Bemetara, Government of Chhattisgarh | India" (in ఇంగ్లీష్). Retrieved 2023-04-29.
  4. "పక్షుల పండుగ! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2023-04-29. Retrieved 2023-04-29.

బయటి లింకులు

మార్చు