పట్టు పురుగు

(పట్టుపురుగు నుండి దారిమార్పు చెందింది)

ఇది పట్టుని సృష్టించే పురుగు.

పట్టు పురుగు
Paired male (above) and female (below)
Silkworm, 4th or 5th instar
పెంపుడు జంతువు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
B. mori
Binomial name
Bombyx mori
Synonyms

Bombyx mori mori

పట్టు పురుగు

మల్భరీ పెంపకం- పట్టు పరిశ్రమ మార్చు

భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చును. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టు పురుగు జీవితం అయిదు స్థాయిల్లో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానికి 'చంద్రిక'లనే చట్రాల్లో పెట్టి ప్రత్యేక గదుల్లో ఉంచి కడు జాగ్రత్తగా పెంచాలి.[1]

నూతన పద్ధతిలో మల్బరీ ను మొక్కల పెంపక కేంద్రంలో పెంచుట మార్చు

పట్టు పురుగుల పెంపకంలో, మల్బరీ మొక్కలను వాణిజ్యపరంగా ఎతైనా లేక చదునైన నారు మడుల నుండి అంటు మొక్కలుగా ఉత్పత్తి చేస్తారు. మొక్క బాగా మొలకెత్తడానికి, బలంగా ఉండడానికి, పోటీగా పెరిగే కలుపు మొక్కలు, నేలలోని తేమ, నేల ఉష్ణోగ్రత వంటివి ప్రభావం చూపుతాయి. ఈ రోజుల్లో, కలుపు తీయడానికి, నీరు, కార్మికుల అందుబాటు, ఖర్చు అడ్డంకులుగా ఉండడం వలన, ఈ సమస్యలను అధిగమించేందుకు ఫాలీధీన్ షీట్లను ఉపయోగించి మల్బరీ మొక్కలను పెంచడం అన్న నూతన పద్ధతి అభివృద్ధి పరచడమైనది. వాణిజ్య అవసరాలకు, ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా విజయవంతమై, శ్రేష్టమైన మల్బరీ మొక్కలను ఉత్పత్తి చేయడంలో మంచి ప్రభావం చూపుతున్నది.

పద్ధతి
30 నుండి 40 సెం.మీ. ల లోతుకు నేలని దున్నిన తరువాత, 8 నుండి 10 మెట్రిక్ టన్నుల పొలంలో తయారు చేసిన ఎరువును, నేలకి అందజేసి, చదును చేయాలి. నారుమడుల రెండు వైపులా, 3/ 4 వ వంతు ఉమ్మడిగా సాగునీటి కాలువలను ఏర్పరచి సిద్ధం చేయాలి. 15 అడుగులు x 5 అడుగుల పరిమాణంలో నల్లని ఫాలీధీన్ షీట్లను కత్తిరించి నారుమడి పై ఉంచాలి. 6 నుండి 7 మాసాల వయసు కల వ్యాధులు లేని మల్బరీ అంటుమొక్కలను ( 16 నుండి 20 సెంమీ. పోడుగుతో 3 చిగుర్లు కలిగినవి) ఫాలీధీన్ తో కప్పిన నారుమడి నేలలోనికి 10 సెం.మీ. x 10 సెం.మీ. ఎడం యిచ్చి నాటాలి. వారానికి లేదా పదిరోజులకు ఒకసారి, ఆ ప్రాంతపు నేల యొక్క స్వభావాన్ని బట్టి, కాలువలలో సాగునీరును ఫాలీధీన్ కే అందజేయాలి.

లాభాలు (Benefits)
ఈ పద్ధతిలో, కలుపు మొక్కలను సూర్యరశ్మి సోకకపోవడం వలన పూర్తిగా నిర్మూలించవచ్చు. మొలకలు ఎదుగుతున్న దశలో (నాలుగు నెలలు) పూర్తి కాలంలో కలుపు తీసే అవసరమే రాదు. ఈ విధంగా, మనుషులను ఏర్పాటు చేసి తీసే కలుపు మొక్కలకయ్యే అధిక ఖర్చు కలిసి వస్తుంది. ఎదుగుతున్న మల్బరీ మొక్కలతో పాటు పోటీగా కలుపు మొక్కలు లేకపోవడం వలన, మల్బరీ మొక్కలు నేలలోని పోషకాలన్నీ అవే వాడుకుని, ఎక్కువ శక్తితో ఎదిగి మంచి శ్రేష్టత కలిగిన మొక్కలను అందిస్తాయి. వేరే పద్ధతుల వలె కాక నీటి సదుపాయాన్ని 50 శాతం తగ్గించవచ్చు. ఎందుకంటే నేల పై పరచిన పాలీధీన్ కవర్ నేల ఉష్ణోగ్రత్తను సాధ్యమైనంతగా తగ్గించి వేస్తుంది. నీటిని ఆవిరి కాకుండ నిరోధిస్తుంది. అందువలన, నేల తేమ సంరక్షింపబడుతుంది.

రాబడి
ఈ పద్ధతిలో నాలుగు నెలల కాలంలో, ఎకరానికి 2.30 నుండి 2.40 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇతర పద్ధతుల కంటే ఈ విధానంలో, సగటు ఆదాయం 50000/- రూలు అధికంగా వస్తుంది.

చౌకి పెంపకం మార్చు

చౌకి పెంపకం అంటే ఏమిటి? పట్టు పరిశ్రమలో మొద టి రెండు దశలను చావ్కీ అంటారు. చావ్కీ స్థాయిలో సక్రమ పద్ధతుల్ని అవలంభించకపోతే పట్టుఉత్పత్తి నాణ్యమైనదిగా ఉండక నష్టాలకు దారితీసే పరిస్థితి రావచ్చు. అందుచేత పట్టు పరిశ్రమలో చావ్కీ ప్రధాన ఘట్టం. ఉష్ణోగ్రత, తేమ, పారిశుద్యం, లేత మల్బరీ ఆకుల నాణ్యత, మంచి పెంపక వసతులు, అన్నిటికంటే మంచి సాంకేతిక నైపుణ్యత చావ్కీ పెంపకంలో ప్రముఖ స్థానం వహిస్తాయి.

వాణిజ్య స్థాయిలో చావ్కీ పెంపకం కేంద్రాలు మైసూరులోని సి.ఎస్.ఆర్.టి.ఐ.లో సంవత్సరానికి 1,60,000 (డి . ఎఫ్. ఎల్.) సామర్థ్యం గల ఆరోగ్యవంతమైన చావ్కీ పెంపక మోడ్ల్ను ఉంచారు. ఈ కేంద్రంలో జట్టుకు 5000 డి. ఎఫ్. ఎల్. చొప్పున ఏడాదికి 32 జట్లుగా పట్టు పరిశ్రమలో అనుభవాన్ని సంపాదిస్తారు. ఈ విధంగా రెంళ్ళు జయప్రదంగా నిర్వహించిన తరువాత ఇటువంటి వాటిని దేశంలో ఇతర పెద్ద పెద్ద పట్టు పరిశ్రమ కేంద్రాలలో కూడా ఎర్పాటు చేస్తారు.

వాణిజ్య స్థాయిలో చావ్కీ పెంపకానికి కావల్సినవి

  • ప్రత్యేక నీరు పారుదల సౌకర్యం కలిగిన మల్బరీ తోట వాణిజ్య చావ్కీ కేంద్రానికి చేరి వుండాలి. పట్టుపురుగుల పెంపకానికి కావలసిన గదులు తప్పనిసveitong)l e88రిగా ఉండాలి. పెంపకానికి అవసరమయ్యే చంద్రి క వంటి పరికరాలు, శాస్త్రీయ శిక్షణ పొంది న తరువాత అనుభవం సంపాదించిన సాంకేతిక సిబ్బంది ఉండాలి.
  • చావ్కీ 80 నుండి 100 మందికి చెందిన 120 నుండి 150 ఎకరాలలో వున్న మల్బరీ తోటల నుండి మాత్రమే పట్టుపురుగు గుడ్లను సేకరించాలి.

వాణిజ్య చావ్కీ కేంద్రాల వల్ల లాభాలు

  • ఎప్పుడూ ఒకే రీతిగా మంచి పట్టు గూళ్ళు దిగుబడిని ఇవ్వడానికిగాను ఆరోగ్యకరమైన చిన్న పురుగులు పొందడానికి అవకాశం ఉంది.
  • ఎప్పుడూ ఒకే రీతిగా ఆరోగ్యకరమైన గూళ్ళను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
  • అంటురోగాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది.
  • గుడ్లు బాగా పొదగడానికి అవకాశం ఉంది.
  • పెంపక సమయంలో పురుగుల శాతం తగ్గకుండా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది.

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]