పట్ర
పట్ర బి.సి.ఏ.గ్రూపులోని మాన కులం సో మే వెంకట చలపతి నాయుడు కదిరి రూరల్ మండలం గంగన్న గారి పల్లి.(9652920773) ఉమ్మడి అనంతపురం శ్రీ సత్య సాయి జిల్లా కదిరి అసెంబ్లీ
చరిత్ర
మార్చు'పట్ర' పూర్వీకులు ఒరియా ప్రాంతానికి చెందినవారు, పట్టు దారాలతో వస్త్రాలు తయారుచేసేవారు. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన తర్వా త శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, అనంతపురం జిల్లాలోని ధర్మవరం ప్రాంతంలో మగ్గం పట్టారు. ఏ ప్రాంతంలో ఉంటే ఆయా ప్రాంతాల్లో తమ కు అనుకూలగా ఉన్న వృత్తులను ఎంచుకున్నారు. గుంటూరు జిల్లా మొదలు చిత్తూరు జిల్లా వరకు కొండలు, అడవులే వీరికి రక్షణ దుర్గాలు. కదిరి నియోజకవర్గ పరిధిలో గొడ్డు వెలగల లో కంబురాయుడు కొండ దుర్గం కొండ గా భావించి స్వామివారికి అక్కడ పట్ర పాలే గాళ్లు కాటమరాయుడు స్వామివారికి ప్రతి సంక్రాంతికి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రాయలసీమలో పలేవాళ్లు ఉన్నారు వీరు పేరు చివర బిరుదు నాయుడు
సమకాలీన సామాజిక జీవితం
మార్చుగిరిపుత్రులుగా జీవనం సాగించే వీరికి చాలాకాలం ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అందలేదు. 40 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత 2007లో బీసీ-ఏ గ్రూప్‌లో రిజర్వేషన్ సౌకర్యం పొందగలిగారు. నాగరిక ప్రపంచానికి దూరంగా జీవిస్తారు. 1901లో మద్రాస్ రాష్ర్ట జనాభా గణనలో ఈ కులాన్ని గురించి వివరణ ఉంది. తెలుగు మాట్లాడే `పట్ర' కులస్తులను ఈ నివేదిక వేటగాళ్ళు, వ్యవసాయదారులుగా పేర్కొంది. అప్పట్లో అనంతపురం జిల్లా ఏర్పడలేదు కనుక ప్రధానంగా కడప, కర్నూలు, జిల్లాల్లో నివసించేవారిగా చూపింది. పట్ర కులస్తు లు ఒరియా నుంచి వలస వచ్చినవారు. ఒరియా మాట్లాడే పట్ర కులస్తులను శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ చూడొచ్చు. అక్కడ దాదాపు ఐదు వేలమంది జీవిస్తున్నారు. 'ఒరియా మాట్లాడే పట్ర వీవర్స్ అసోసియేషన్' అనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాష్ర్టవ్యాప్తంగా చూస్తే గుంటూరు జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు వ్యాపించి ఉన్నారు. కర్నాటక రాష్ర్టంలో చిత్తూరు సరిహద్దు నుంచి బెంగళూరు వరకు, కొంతమేర తమిళనాడులో కూడా వీరిని చూడొచ్చు. గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తరించిన నల్లమల్ల అడవులను, గుట్టలను ఆధారం చేసుకుని వీరు జీవిస్తున్నారు. పట్ర కులస్తులు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం తదితర కొండ, అటవీ ప్రాంతాల్లో దొరికే ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. బోయలుగా, రైతుకూలీలుగా కూడా వీరు కనిపిస్తారు. కడప జిల్లాలోని పులివెందులలో స్వర్ణకారులుగా పనిచేస్తున్నారు. ధర్మవరం, శ్రీకాకుళం జిల్లా లోని కంచిలి మండలంలో మగ్గం కార్మికులుగా జీవిస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలో కాపు సారా కాస్తుంటారు. రాయలసీమ ప్రాంతంలో పాళ్యగాళ్లు పాలించారు
రిజర్వేషన్లు
మార్చు1968 వరకు బీసీ జాబితాలో ఉన్న వీరిని అనంతరామన్ కమిషన్ తొలగించింది. అనంతరామన్ కమిషన్ పట్ర కులాన్ని బీసీ జాబితా నుండి 1968లో తొలగించింది. 1986లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం వీరిని బీసీ-డిలో చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు.రిజర్వేషన్ శాతం 50 కంటే ఎక్కువగా ఉందనీ, ఇది రాజ్యాంగ బద్ధం కాదని తీర్పు వెలువడింది. రిజర్వేషన్ శాతం పెంపుదల, బీసీ జాబితా సవరణ అనే రెండు అంశాలు ఒకే జీఓలో చేర్చటంతో రిజర్వేషన్ పెరుగుదలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు మొత్తం జీఓనే చెల్లలేదు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1994లో తిరిగి వీరిని బిసీ జాబితాలో చేర్చారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 2004లో ఆంధ్రప్రదేశ్ ఓబిసీ జాబితాలో సీరియల్ నంబర్ 105లో చేరుస్తూ కేంద్ర గెజిట్ విడుదలైంది. 2006లో బీసీ కమిషన్ పట్ర కులాన్ని బీసీ-ఏ గ్రూప్‌లో వీరిని చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మొత్తంమీద 40 ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితంగా పట్ర కులాన్ని బిసి-ఏ గ్రూప్‌లో చేరుస్తూ 2007లో జీఓ విడుదల అయ్యింది. రాజధాని హైదరాబాద్‌లో పట్ర కులానికి కూడా కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని తమ కులానికీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ వృత్తుల్లో ఉన్న పట్ర కులం వారికి చేయూత నివ్వాలని ఈకులస్తులు కోరుతున్నారు.