పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు
పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు బౌద్ధమత కళలో చాలా ప్రాముఖ్యత ఉన్న ఆకృతి. ఈ ఆకృతిలో బుద్ధుడు నిద్రపోతున్నట్టు భూమికి వాలి, ఒక పక్కకు తిరిగి పడుకున్నట్టు ఉంటుంది. ఇది బుద్ధుని జీవితంలోని ఆఖరి రోజుల్లో ఆరోగ్యం విషమించినప్పుడు శరీరం వదిలివేసే(మహాపరినిర్వాణం) అవస్థకు ముందున్న పరిస్థితిని చూపిస్తుంది.[1] ఈ ఆకృతిలో బుద్ధుడు తన కుడివైపుకి తిరిగి, కుడి చేతిని తల కింద ఆధారంగా చేసుకొని పడుకుని ఉంటాడు. బుద్ధుడి మరణం తరువాత, అతని అనుచరులు బుద్ధుడు శయనావస్థలో ఉన్న విగ్రహాన్ని రూపొందించాలని అనుకున్నారు.మొదటగా అలాంటి విగ్రహాన్ని వాట్ ఫొ లో తయారు చేసి, కాలక్రమేణా ఆగ్నేయ ఆసియాలోని అన్ని ప్రాంతాలలో ఈ భంగిమలో విగ్రహాలు ప్రతిష్ఠించడం ఒక పోకడగా మారింది.
థాయి చిత్రకళలో
మార్చుథాయి బౌద్ధ చిత్రకళలో పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు, బుద్ధుని జీవితానికి సంబంధించిన మూడు ఘట్టాలను గురించి అయి ఉండవచ్చు.
- నిర్వాణ స్థితి (ปางปรินิพพาน; పాంగ్ పరి నిప్ఫన్)
- అసురుడైన రాహుకు బోధ చేస్తున్న స్థితి (ปางโปรดอสุรินทราหู; పాంగ్ ప్రోడ్ అసురిన్ త్రా రాహు)
- నిద్రా స్థ్తి (ปางทรงพระสุบิน; పాంగ్ సొంగ్ ఫ్రా సుబిన్)
కొన్ని ఉదాహరణలు
మార్చు- మవ్లమ్యైంగ్ లో ఉన్న విన్‌సీయిన్ తవ్యా బుద్ధుడు - 182.9 మీటర్లు (600 అ.)[3]
- మొనైవాలో ఉన్న థన్‌బొద్ధాయ్ పగోడా - 101 మీటర్లు (331 అ.)[3]
- బాగో లోని మైయతల్యౌంగ్ బుద్ధుడు - 82 మీటర్లు (269 అ.)[3]
- దవెయ్ లో ఉన్న లౌక తరహ్పు బుద్ధుడు - 73.6 మీటర్లు (241 అ.)[3]
- యాంగన్ లో ఉన్న చౌఖ్తత్గై బౌద్ధాలయం - 66 మీటర్లు (217 అ.)[3]
- బాగో లోని శ్వేతల్యౌంగ్ బుద్ధుడు - 54.8 మీటర్లు (180 అ.)[3]
- బాగన్ లోని మనూహా దేవాలయం
- మొనైవా దగ్గర ఫొవింతౌంగ్
- అంగ్ కోర్ వాట్ లోని బఫువాన్ లో పశ్చిమ భాగం
- ఫ్నొం కులెన్ లో ఎడమ వైపుకు పడుకుని ఉన్న ఏకశిలా బుద్ధుడు
- క్రేటీ ప్రావిన్స్ లో బంగారు తాపడం చేసిన బుద్ధుడు, సంబొక్ పర్వతం పై (కుడివైపుకు ఆని ఉన్న విగ్రహం)
- ఝాంగ్యె లోని డఫొ దేవాలయం
- భమల బుద్ధ పరినిర్వాణ, 1800 ఏళ్ళ పాతది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది. [4]
- అజంతా గుహలు లోని 26వ గుహ
- తూర్పు జావాలోని త్రొవులాన్ లో మహా విహార మొజొపహిత్
- కోయా పర్వతంపై కొంగోబూజీ
- నన్‌జొయిన్ దేవాలయం, ఫుకుఒక లో.
- పెనాంగ్ లోని వాట్ ఛాయమంగ్కలరం
- పెరాక్ లోని సాం పొహ్ తొంగ్ దేవాలయం
- కెలంతన్ లోని తుంపాత్ లో ఉన్న వాట్ ఫొథివిహన్
- దంబుల్లా
- గల్విహార (12వ శతాబ్దం)
- దుషాన్బె లోని తజికిస్తాన్ జాతీయ సంగ్రహాలయంలో ఉన్న 13 మీటర్ల పొడవు ఉన్న బుద్ధుడి విగ్రహం. అజిన-తెప లో కనుగొన్నది.
- వాట్ ధమ్మచక్సెమరం లో ఉన్న 7వ శతాబ్దానికి చెందిన శయనావస్థ బుద్ధుడు. ద్వారావతి శైలిలో ఉంది.
- అయుథ్థయ లో ఉన్న వాట్ లొకాయా సుతరం
- బ్యాంగ్కాక్ లో ఉన్న వాట్ ఫొ
మూలాలు
మార్చు- ↑ "మహాపరినిర్వాణం గురించిన ప్రవచన పాఠ్యం" (PDF). www.themindingcentre.org. p. 140. Archived from the original (PDF) on 2018-12-09. Retrieved 2018-12-07.
- ↑ "కాంబోడియా పర్యాటక వ్యాసంలో వివరాలు".
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 మా తనేజీ (February 2014). "చౌఖ్తత్గై బౌద్ధాలయంలో పడుకొని ఉన్న భంగిమలోనున్న బుద్ధుడి ఆకృతి" (PDF). మై మ్యాజికల్ మయాన్మార్. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 7 డిసెంబరు 2019.
- ↑ "dawn.com/news/1264290".
బయటి లంకెలు
మార్చుMedia related to పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహాల ఫోటోలు at Wikimedia Commons