పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు యోగా సాధన కొరకు పతంజలి మహర్షి ఏర్పరిచిన సూత్రాలు. ఇందులో 195-196 సూత్రాలు ఉన్నాయి. వీటిని పతంజలి మహర్షి సామాన్య శకం ఆరంభంలో అంతకంటే ప్రాచీనమైన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయ పరిజ్ఞానాన్ని క్రోడీకరించి సూత్రాల రూపంలో గ్రంథస్థం చేశాడు.[1][2][3] ఈ సూత్రాలు సమాధి స్థితిని చేరుకోవడానికి ఉపయోగపడే అష్టాంగ యోగ మార్గాన్ని వర్ణిస్తాయి. ఆ ఎనిమిది నియమాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.

పతంజలి విగ్రహం

ఈ సూత్రాలు సాంఖ్య దర్శనంలో పేర్కొన్న పురుష, ప్రకృతి అనే భావనల మీద ఆధారపడి ఏర్పాటు చేసినవి. వీటికి కొంచెం బౌద్ధ మతంతో కూడా సంబంధం ఉన్నది. సాంఖ్య, యోగ, వేదాంత దర్శనాలే కాక జైన, బౌద్ధ సాంప్రదాయాలన్నీ ప్రాచీన భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భక్తి, కర్మకాండల సాంప్రదాయాలకు భిన్నమైన వైరాగ్య ప్రవృత్తికి వేర్వేరు అభివ్యక్తీకరణలే.

ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న యోగా సాంప్రదాయానికి పతంజలి యోగసూత్రాలను ఒక మూల గ్రంథంగా పేర్కొనవచ్చు.

రచయిత, కాల నిర్ణయం

మార్చు

యోగసూత్రాల ప్రతి మీద ఉన్న ముద్ర ఆధారంగా దీని రచయిత పతంజలి అని తెలుస్తోంది.[4][5][6][7] పతంజలి అనే వ్యక్తిని గుర్తించడం మాత్రం పండితుల మధ్య అనేక చర్చలకు దారితీసింది. ఎందుకంటే ఇదే రచయిత పేరుతో మహాభాష్య అనే పేరుగల సంస్కృత వ్యాకరణ గ్రంథం ఉంది. ఈ గ్రంథం సా.శ.పూ 2వ శతాబ్దం నాటిదిగా గుర్తించారు. కొంతమంది పండితులు ఈ రెండు పుస్తకాలు ఒకరే రాసి ఉండవచ్చునని వాదిస్తున్నా, ఇండాలజిస్టు లూయిస్ రెనౌ మాత్రం ఈ రెండు గ్రంథాల మధ్య భాష, వ్యాకరణం, పదజాలం మొదలైన అంశాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించాడు.[4][5][6][7]

మూలాలు

మార్చు
  1. Wujastyk 2011, p. 33.
  2. Feuerstein 1978, p. 108.
  3. Tola, Dragonetti & Prithipaul 1987, p. x.
  4. 4.0 4.1 Tola, Dragonetti & Prithipaul 1987, p. xi.
  5. 5.0 5.1 Surendranath Dasgupta (1992). A History of Indian Philosophy. Reprint: Motilal Banarsidass (Original: Cambridge University Press, 1922). pp. 230–238. ISBN 978-81-208-0412-8.
  6. 6.0 6.1 James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: N-Z. The Rosen Publishing Group. pp. 506–507. ISBN 978-0-8239-3180-4.
  7. 7.0 7.1 White 2014, pp. 34–38.