హిందూ ధర్మశాస్త్రాలలో జీవుడు, ప్రకృతి, తత్వము, మోక్షము వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను దర్శనాలు అంటారు. సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది సాంఖ్యదర్శనము.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

ఇది కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడింది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి.

ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబడిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంథం.

మౌలిక సూత్రాలు

మార్చు

సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును

  1. ప్రత్యక్ష ప్రమాణాలు : మనకు ఇంద్రియాల ద్వారా తెలిసేది. (ఉదా:స్వయంగా చూసింది, విన్నది, స్పృశించింది...). వీటిలో మళ్ళీ రెండు విధాలున్నాయి
    నిర్వికల్ప ప్రమాణాలు: ఇంద్రియాల ద్వారా గ్రహించింది, కాని అర్ధం కానిది. (ఉదా: ఒక పసిపిల్లవాడు ఒక జంతువును చూస్తాడు కాని వాడికి దాన్ని గురించి ఏమీ తెలియకపోవచ్చును)
    సవికల్ప ప్రమాణాలు: ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం చేసుకొన్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుసుకున్నది. ఇది సరై జ్ఞానానికి ఆధారం.
  2. అనుమాన ప్రమాణాలు: ఇలా కావచ్చును అని ఊహించింది. ప్రత్యక్ష ప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం. (ఉదా: పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం)
  3. శబ్ద ప్రమాణం: వేరేవారు చెప్పగా విన్న విషయాలు

సాంఖ్య తత్వము

మార్చు

ప్రధాన విషయాలు

మార్చు

"పురుషుడు", "ప్రకృతి" అనేవి రెండు విభిన్నమైన అంశాలు అనేది సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి చెందుతాయి.

  • పురుషుడు

అంతటా వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార ఆత్మ తత్వం. అంతటా ఉంది. ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో చెప్పజాలనిది. (వేదాంతములో "బ్రహ్మము" కూడా ఇలాగే వర్ణించబడింది.) పురుషునకు ఏవిధమై మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము. పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ సృజింపడు.

  • ప్రకృతి

సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉంది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యథార్థంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.

  • ఈశ్వరుడు

కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. కారణం - ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు గనుకా, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణమని చెప్పడం అసంబద్ధం గనుకా.

తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగసిద్ధాంతాలలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు.

వైవిధ్యం

మార్చు

సాంఖ్యవాదం ప్రకారం సృష్టికి పురుషుడు, ప్రకృతి - రెండూ కారణాలే. పురుషుడు "ఆత్మ"కు, చైతన్యానికి మూలము. ప్రకృతి "పదార్ధము"నకు, పరిణామమునకు మూలములు.

సృష్టి సిద్ధాంతం

మార్చు

సాంఖ్యం "సత్కార్యవాదం"ను సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణము, ఫలితము కలిసి ఉంటాయి. ఉన్నదేదీ నశించదు. లేనిదేదీ ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. అందుకు కారణంలో ఫలితం అంతర్లీనంగా ఉంటుంది. వీరి "ప్రకృతి పరిణామ వాదం" ప్రకారం మూల ప్రకృతి అన్నిటికీ కారణం. అదే క్రమంగా విభజితమై వివిధ పదార్ధాలుగా పరిణామం చెందుతుంది. చివరిలో అన్నీ మళ్ళీ అవిభాజిత మూల ప్రకృతిలో లీనమౌతాయి. ఇలా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తాయి.

వైవిధ్యం, ఘర్షణ అనేవి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. వీటివల్లనే ప్రకృతి 24 వేర్వేరు గుణాలు (తత్వాలు) గా విభజితమౌతుంది. ఆ గుణాలమధ్య ఉన్న మధనక్రియ పరిణామానికి మూలకారణం. ఇందుకు మూడు ముఖ్యమైన తత్వాలు.

  • సత్వము - సమతుల్యతను పెంపొందించే గుణము.
  • రజస్సు - వృద్ధిని, ప్రయత్నాన్ని పెంపొందిస్తుంది.
  • తమస్సు - అలసత్వాన్ని పెంచుతుంది. ప్రయత్నాన్ని నిరోధిస్తుంది.

సృష్టిలో అన్ని జీవులలో ఈ గుణాల వలన ఉత్పన్నమయ్యే లక్షణాలు:

ఈ గుణాల మధ్య తులనాన్ని బట్టి జీవుల, పదార్ధాల లక్షణాలు మారుతాయి. పరిణామం జరుగుతుంది. సాంఖ్య సిద్ధాంతాలు పతంజలి యోగసూత్రాలలోను, మహాభారతంలోను, యోగవాసిష్టం లోను విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి.

అన్ని జీవులలోను ఆత్మ పురుషుని స్వరూపము. మనసు, బుద్ధి, అహంకారము ప్రకృతి లక్షణాలు.

మోక్షము

మార్చు

అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పురుషుడు" (అనగా జీవాత్మ) శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణాలు, మనసు, అహంకారము, మహాత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.

ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉంది. అద్వైత వేదాంతం ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్థం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా వేర్వేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.

వనరులు

మార్చు
  • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ

బయటి లింకులు

మార్చు