పదహారు కళలకు ప్రాణాలైన

పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య (1997) సినిమాలోని పాట. దీనిని జె.కె. భారవి రచించారు. దీనిని మనో గానం చేశారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

నేపథ్యం మార్చు

అన్నమయ్య ఇద్దరు భామల ప్రేమలో పడ్డాడు. అతని దృష్టిలో భక్తి అంటే ప్రియురాళ్లపైన ఉన్న రక్తి, పూజ అంటే శృంగార పూజ. అర్చన అంటే అంగాంగ వర్ణన. ఈ స్థితిలో ఉన్న అన్నమయ్య తన రసాధిదేవతలకు శృంగారార్చన చేస్తున్నట్లుగా సినిమాలో చిత్రీకరించారు. తిరుమలలో స్వామివారికి షోడశోపచార పూజ (షోడశ అనగా పదహారు) జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్నమయ్య ప్రియురాళ్లకు ప్రేమ పూజ చేస్తుంటాడు. రెండింటినీ సమంగా పోలుస్తూ నడుస్తుందీ పాట, దాని చిత్రీకరణ.

పాట మార్చు

బృందం : ఓం. శ్రీపద్మావతీ భూదేవీ సమేతస్య

శ్రీమద్వేంకట నాయకస్య నిత్యషోడశోపచార పూజాం చ కరిష్యే ఆవాహయామి.

అతను : పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం


బృందం : ఓం ఆసనం సమర్పయామి.

అతడు : పరువాల హొయలకు పయ్యెదలైన

నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం.

విశ్లేషణ మార్చు

ఈ పాట "శ్రీపద్మావతీ భూదేవీ సమేతస్య శ్రీమద్వేంకట నాయకస్య" అని మొదలౌతుంది. వెంటనే అన్నమయ్య ప్రియురాళ్లకి "పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం" అంటూ మొదలుపెడతాడు.

అక్కడ స్వామివారికి "ఆసనం సమర్పయామి" అనగానే... ఇక్కడ "ఊహల లాలనలకు ఊరువుల ఆసనం" వేస్తాడు అన్నమయ్య.

కొండపై స్వామికి "స్నానం సమర్పయామి" అని పూజిస్తే.. ప్రియురాళ్లకు "పన్నీటి స్నానం" చేయిస్తాడు.

తాంబూలమూ నైవేద్యమూ సాష్టాంగ వందనాలతో అక్కడ వేంకటేశ్వరునికి షోడశోపచార పూజ జరుగుతుంటే తన రసాధిదేవతలకు అన్నమయ్య అర్చనలు చేస్తుంటాడు.

మూలాలు మార్చు

  • ఆ రెండూ చక్కగా కుదిరాయి !, పాట కచేరి, ఈనాడు ఆదివారం, 9 జనవరి 2011 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.