పద్మరాగం అనగా ఒక రకమైన చాలా అరుదైన రత్నము. సంస్కృతంలో పదపరశ్చ అని అంటారు. పద్మరాగం 'కెంపు' కు దగ్గర పోలికగా ఉంటుంది. వాస్తవానికి పద్మరాగం 'నీలమణి' (Sapphire) రత్నం రకానికి చెందినది. ఇది చంద్రిక (Pink), పసుపు (Yellow), ఎరుపు (Red), నారింజ (Orange) రంగుల సమ్మేళనంలో ఉంటుంది. ఇది ప్రధానంగా శ్రీలంక దేశంలో లభ్యమవుతుంది. మరోవిధంగా చెప్పాలంటే తామర పద్మం రంగులో ఉంటుంది. పరిశుద్ధ బైబిలు గ్రంథం - ప్రకటన గ్రంథం (తెలుగు అనువాదం) లో పేర్కొనబడింది. ఎవరైనా పద్మరాగం ధరిస్తే ఆ మనిషిలో తమోగుణం తీసివేస్తుందని, పాపాలు పోతాయని ఒక నమ్మకం కూడా ఉంది.

కెంపులు ప్రకాశించే విధానం, రంగును బట్టి ఆరు రకాలుగా విభజించారు.

  1. పద్మరాగము : ఉదయించే సూర్యుని రంగు
  2. సౌగంధికము : దానిమ్మ పువ్వు రంగు కలది
  3. కురు విందము : కోకిల నేత్రపు రంగు కలది.
  4. మాంస గంది : కుందేటి మాంసపు రంగు కలది
  5. నీల గంధి :నలువు-ఎరుపుల మిశ్రమపు రంగు
  6. కోమలం : లేత ఎరువీపు రంగు కలది

వీటన్నింటిలో పద్మరాగం ఉత్తమమైనది.[1]


మూలాలు మార్చు

  1. "Teluguastrology | Jathakam |teluguastrology.in". teluguastrology.in (in ఇంగ్లీష్). Retrieved 2020-05-10.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పద్మరాగం&oldid=2986525" నుండి వెలికితీశారు