పద్మ సచ్‌దేవ్

డోగ్రీ కవి, నవలాకారుడు

పద్మ సచ్‌దేవ్ (ఆంగ్లం: Padma Sachdev) (జ: 1940) భారతీయ కవయిత్రి, నవలా రచయిత్రి. ఈమె జమ్మూ కాష్మీర్ రాష్ట్రపు అధికారిక డోగ్రీ భాషకు చెందిన మొదటి ఆధునిక కవయిత్రి.[1] ఈమె హిందీలో కూడా రచనలు చేయగలరు. ఈమె చాలా కవితా సంకలానల్ను ప్రచురించినా; వానిలో మేరీ కవితా మేరీ గీత్ (My Poems, My Songs) కు గాను 1971లో సాహిత్య అకాడమీ పురస్కారం ఇవ్వబడింది.[2][3] ఈమె 2001 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందారు.[4] ఈమె మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు కబీర్ సమ్మాన్ చే గౌరవించబడింది.[5]

పద్మ సచ్‌దేవ్
Padma Sachdev
పుట్టిన తేదీ, స్థలం1940 (age 83–84)
జమ్ము, ఇండియా
వృత్తిరచయిత, కవయిత్రి
భాషడోగ్రీ
జాతీయతభారతీయురాలు
జీవిత భాగస్వామిసురీందర్ సింగ్ (m. 1966)

వ్యక్తిగత జీవితం మార్చు

సచ్‌దేవ్ జమ్ములో 1940 సంవత్సరంలో ముగ్గురు పిల్లలలో పెద్దదానిగా జన్మించింది. వీరి తండ్రి సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ జైదేవ్ బాబు. ఈమె గాయకుడైన సురీందర్ సింగ్ ను 1966 లో వివాహం చేసుకొన్నది.[6] వీరు ప్రస్తుతం న్యూఢిల్లీ లో నివసిస్తున్నారు.[2]

వృత్తిజీవితం మార్చు

సచ్‌దేవ్ ఆకాశవాణి, జమ్ము కేంద్రంలో అనౌన్సర్ గా చేరారు.[6] తర్వాత ఆమె ముంబై కేంద్రంలో కూడా కొంతకాలం పనిచేశారు.[2] ఈమె రచించిన చాలా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వానిలో తావి తే చంహాన్ (Rivers Tavi and Chenab, 1976), నెరియా గలియా (Dark Lanes, 1982), పోతా పోతా నింబల్ (Fingertipful Cloudless Sky, 1987), ఉత్తర వాహిని (1992), తైంతియన్ (1992) మొదలైనవి ముఖ్యమైనవి.[1][2]

పురస్కారాలు మార్చు

రచనలు మార్చు

  • Naushin. Kitabghar, 1995.
  • Main Kahti Hun Ankhin Dekhi (Travelogue). Bharatiya Gyanpith, 1995.
  • *Bhatko nahin Dhananjay. Bharatiya Gyanpith, 1999. ISBN 8126301309.
  • Amrai. Rajkamal Prakashan, 2000. ISBN 8171787649.
  • Jammu Jo Kabhi Sahara Tha (Novel). Bharatiya Jnanapith, 2003. ISBN 8126308869.
  • Phira kyā huā?, with Jnaneśvara, and Partha Senagupta. National Book Trust, 2007. ISBN 812375042.
  • Where Has My Gulla Gone (Anthology). Prabhat Prakashan, 2009. ISBN 8188322415.
  • A Drop in the Ocean: An Autobiography. tr. by Uma Vasudev, Jyotsna Singh. National Book Trust, India, 2011. ISBN 8123761775.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 George, p. 522
  2. 2.0 2.1 2.2 2.3 Mathur, p. 182
  3. "Sahitya Akademi Award". Official website. Archived from the original on 2014-02-21. Retrieved Feb 26, 2013.
  4. "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 2013-05-10. Retrieved 2014-03-22.
  5. "Rashtriya Mahatma Gandhi Award to be given to Seva Bharti". August 10, 2008. Archived from the original on 2013-09-27. Retrieved Feb 26, 2013.
  6. 6.0 6.1 "Song of the Singhs". The Hindu. May 6, 2004. Archived from the original on 2004-07-05. Retrieved Feb 26, 2013.

బయటి లింకులు మార్చు