పద్య కవిత ఒక ఛందోబద్దమైన నడకలో కూర్చబడేది. మనం అక్షరాలను, వాటిని పలకడానికి పట్టే సమయాన్ని బట్టి అంటే ఒక లిప్తకాలంలో పలికే అక్షరాలను లఘువుఅని, రెండు లిప్తలకాలం పట్టే అక్షరాలను గురువు అని అంటారు. ఈ లఘువు,గురువులు రెండు కన్నా ఎక్కువగా కలిసినప్పుడు దానిని గణము అంటారు. వీటిలో రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి. ఇటువంటి గణములతో కూర్చిన నియమబద్ధమైన గతిలో అక్షరాలను కూర్చడమే ఛందస్సు. పద్యాలభేదాలను బట్టి గణాల అమరికి ఉంటుంది. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనే భేదాలు కనిపిస్తాయి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మొదలైనవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనేవి ఉపజాతులు.

లయబద్దంగా సాగుతున్న పద్యంలో వచ్చే విరామస్థానాన్ని యతి అంటారు. అలాగే ప్రాస అంటే పద్యం ప్రారంభంలో కానీ, పద్యపాదాల చివరగానీ ఒకే అక్షరం పదే పదే రావడం. దీనివల్ల పద్యం ఇంపుగా వినబడుతుంది.తెలుగు పద్యాలలో యతి ప్రాసలు పద్య లక్షణాలను బట్టి నియమబద్ధంగా వస్తాయి. మొత్తానికి తెలుగు సాహిత్యానికే ప్రత్యేకమయిన పద్య రచన గురించి, పద్యాలలో ఛందస్సు నియమాలగురించి ఏమాత్రం అవగాహన లేకుండా పద్య రచన కుదరదన్నమాట. గణ, యతి, ప్రాస నియమాలను తెలుసుకుంటేనే ఆయా రీతులలో పద్యరచన సాగుతుంది.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పద్య_కవిత&oldid=3871993" నుండి వెలికితీశారు