పనస బుట్టలు ఉత్తరాంధ్ర వారి ప్రత్యేక వంటకం. వినాయక చవితికి తప్పక వండుతారు. లేత పనసాకులను బుట్టలా కుట్టి అందులో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. వీటిని పొట్టిక్కలు అని కూడా అంటారు.[1][2]

పనస బుట్టలు

కావలసిన పదార్థాలు మార్చు

తయారీ విధానం మార్చు

పనసాకులు తెచ్చి వాటిని శుభ్రం చేసి నాలుగు ఆకులను కలిపి ఒక బుట్టలా కుడతారు. మూడాకుల తొడిమలు తీసి వేసి, ఆకు కొసలను దగ్గరగా ఒకదాని మీద ఒకటి పెట్టి పుల్లలతో విస్తరి కుట్టినట్టుగా కుడతారు. ఒకాకు తొడిమను మాత్రము ఉంచుతారు. ఆ తొడిమతో బుట్టను పట్టుకుంటారు.[1][3]

మినపపప్పును మూడు గంటలు నానవేసి, మెత్తగా రుబ్బుకోవలి. దానికి ఇడ్లీ రవ్వను కలిపి కొంత సేపు నాననిచ్చి దానికి తగినంత ఉప్పును కలపాలి. ఈ పిండిని ఈ బుట్టలలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. లేత పనస రసము అంటిన ఆ బుట్టలు కొబ్బరి పచ్చడి లేక అల్లపు పచ్చడితో గాని తింటారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "పొట్టిక్కలు". andhrajyothy. Retrieved 2021-10-21.
  2. "ఆహా ఏమిరుచి: పనసాకు పొట్టిక్క... రుచిలో దిట్టక్క!". ETV Bharat News. Retrieved 2021-10-21.
  3. Kashetti, Srikanth. "Here's All You Need To Know About East Godavari's Traditional And Tasty Food "Ambajipeta Pottikkalu"!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-21. Retrieved 2021-10-21.