ప్రభుత్వ విశ్వవిద్యాలయం

(పబ్లిక్ యూనివర్సిటీ నుండి దారిమార్పు చెందింది)

ప్రభుత్వ విశ్వవిద్యాలయం ప్రధానంగా ప్రభుత్వ నిధులతో స్థాపించబడిన విశ్వవిద్యాలయం. అనగా జాతీయ లేక ఉపజాతీయ ప్రభుత్వ నిధులతో ఈ విశ్వవిద్యాలయం నడపబడుతుంది. ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి అనగా వ్యక్తిగత విశ్వవిద్యాలయానికి వ్యతిరేకమైనది. ప్రభుత్వ విశ్వవిద్యాలయం జాతీయ విశ్వవిద్యాలయమా కాదా అనేది అది పనిచేసే ప్రాంతీయ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఐఐటి, గువహాటి

భారతదేశం

మార్చు

భారతదేశంలో చాలా విశ్వవిద్యాలయాలూ, దాదాపుగా అన్ని పరిశోధనా సంస్థలూ ప్రభుత్వ రంగం లోనివే. కొన్ని ప్రైవేట్ అండర్గ్రాడ్యుయేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలే. అయితే వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధం గానే ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలల్లో కొన్నిటికి కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా సహాయం చేస్తాయి. భారతదేశంలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అనే "ఓపెన్" పబ్లిక్ యూనివర్శిటీ కూడా ఉంది. ఇది ఎక్కువగా దూర విద్యను అందిస్తుంది. ఇప్పుడు 40లక్షల మంది విద్యార్థులతో ఇది విద్యార్థుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం.

ప్రైవేటు విశ్వవిద్యాలయా లున్నప్పటికీ వాటికి పేరులో "విశ్వవిద్యాలయం" అని పెట్టుకునే హక్కు, ప్రచారం చేసుకునే హక్కూ లేదు. "డీమ్‌డ్ టు బి యూనివర్సిటీ" (విశ్వవిద్యాలయంగా పరిగణించబడినది) అని మాత్రమే అవి పెట్టుకోగలుగుతాయి.

ఆస్ట్రియా

మార్చు

విశ్వవిద్యాలయాలు చాలా వరకు ప్రభుత్వ రంగం లోనివే. ఇక్కడి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నింటి లోనూ ఫీజులు ఒకే విధంగా ఉంటాయి. వైద్య విద్య వంటి కొన్ని చదువులు తప్ప విశ్వవిద్యాలయానికి హాజరు కావడానికి "మెచ్యూరా" అనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో నైనా చేరే హక్కు ఉంది.

డెన్మార్కు

మార్చు

దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగం లోనివే. వీటికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కంటే అధిక గౌరవం ఉంది. డెన్మార్కు‌లో విశ్వవిద్యాలయ విద్య ఉచితం.

ఫిన్లాండు

మార్చు

ఫిన్లాండులో విశ్వవిద్యాలయాలన్నీ ప్రభుత్వరంగం లోనివే. వీటిలో విద్య పూర్తిగా ఉచితం.

ఫ్రాన్సు

మార్చు

చాలా ఉన్నత విద్యాసంస్థలు ( విశ్వవిద్యాలయాలు, గ్రాండ్స్ ఎకోలెస్) ప్రభుత్వ రంగం లోనివే. వీటిలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి (సంవత్సరానికి € 400). దీనికి మినహాయింపులు హెచ్‌ఇసి స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి వ్యాపార పాఠశాలలు. "కోడ్ డి ఎల్'అడ్యుకేషన్" చట్టం లోని ఆర్టికల్ L731-14 ప్రకారం, "ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలను విశ్వవిద్యాలయం అనే పేరుతో పిలవనే కూడదు. కానీ కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ లియోన్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు "విశ్వవిద్యాలయం" అనే పేరును తమ మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తున్నాయి.

జర్మనీ

మార్చు

చాలా ఉన్నత విద్యాసంస్థలు ప్రభుత్వ రంగం లోనివే. వీటిని ఎకువగా రాష్ట్రాలు నిర్వహిస్తూంటాయి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లందరూ ప్రభుత్వ ఉద్యోగులే. సాధారణంగా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ప్రైవేట్ రంగం లోని వాటి కంటే ఎక్కువ గౌరవం, మన్ననా ఉంటుంది. 1972 నుండి 1998 వరకు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజు అసలు ఉండేది కాదు. అయితే, అప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు తక్కువ స్థాయిలో ట్యూషన్ ఫీజులను వసూలు చేస్తున్నాయి.

నెదర్లాండ్స్

మార్చు

దాదాపుగా విశ్వవిద్యాలయాలన్నీ ప్రభుత్వ రంగం లోనివే. ఎక్కువగా విద్యా మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. డచ్ పౌరులు గాని, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల పౌరులు గానీ తమ మొదటి బ్యాచిలర్ డిగ్రీ లేదా మొదటి మాస్టర్ స్థాయి డిగ్రీ కోసం నమోదు చేసుకుంటే, విశ్వవిద్యాలయంతో గానీ, ప్రోగ్రాము‌తో గానీ సంబంధం లేకుండా ఒకే ట్యూషను ఫీజు ఉంటుంది. 2015 లో ఇది 1,951 యూరోలుగా ఉండేది. [1] యూరోపియనేతర విద్యార్థులు, రెండవ బ్యాచిలర్ లేదా రెండవ మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు 'లీగల్ స్కూల్ ఫీజు'ను చెల్లించాలి. ఇందులో విద్యార్థి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఈ ఖర్చును ప్రభుత్వం భరించదు. చదివే కోర్సును బట్టి ఈ ఫీజులు సంవత్సరానికి సుమారు 7,000 నుండి 30,000 యూరోల వరకూ ఉంటుంది. ప్రైవేటుతో సహా, అన్ని విశ్వవిద్యాలయాలనూ విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

నార్వే

మార్చు

దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలన్నీ ప్రభుత్వ రంగం లోనివే, ప్రభిత్వ నిధులతో నడిచేవే.

మూలాలు

మార్చు
  1. "Archived copy". Retrieved 2015-12-29.