పరకాయప్రవేశం ఒక ప్రాచీనమైన కళ. ఈ కళ తెలిసిన వ్యక్తి మరణించిన జంతువుల లేదా మనుషుల శరీరం (కాయం) లోనికి ప్రవేశించి ఆ జీవు యొక్క శరీరంతో కొన్ని పనులు చేసి అవసరం తీరిన తరువాత తిరిగి ఆ శరీరాన్ని వదలి తన శరీరంలోని ప్రవేశించవచ్చును. అయితే అంతవరకు వదలిన తన శరీరం జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం ఉన్నది. లేనియెడల పరకాయప్రవేశం చేసిన శరీరంతోనే సంచరించాల్సి ఉంటుంది. పరుల శరీరంలో ప్రవేశించే విద్య కాబట్టి పర కాయ ప్రవేశం అని పేరువచ్చినది.

ఇలాంటి భారతీయ ప్రాచీన విలువైన విద్యల్ని, పురాతన పుస్తకాల్ని విదేశీయుల దండయాత్రలు,కులమత బేధాలతో కోపతాపాల ప్రదర్శనల్లో అందరూ కలిసి ఎప్పుడో తగులబెట్టి ఈ కాలం వరకు రాకుండా చేసారు.