పరకాల ప్రభాకర్ ఒక తెలుగు రాజకీయ నాయకుడు, వ్యాఖ్యాత, విశ్లేషకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి స్థాయి గల "కమ్యూనికేషన్స్ సలహాదారు" గా పనిచేసాడు. రాజకీయ వ్యాఖ్యాతగా, ఆంధ్రప్రదేశ్ లోని టెలివిజన్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకునిగా గుర్తింపు పొందాడు. ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ గా పనిచేసాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. "విశాలాంధ్ర మహాసభ" కు వ్యవస్థాపక కార్యదర్శి.[1]

పరకాల ప్రభాకర్
మాతృభాషలో పేరుపరకాల ప్రభాకర్
జననం (1959-01-02) 1959 జనవరి 2 (వయస్సు: 61  సంవత్సరాలు)
నరసాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
చదువుPh.D
విద్యాసంస్థలులండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్,
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
వృత్తిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి "సమాచార సలహాదారు"
ప్రసిద్ధులురాజకీయ వ్యాఖ్యాత
జీవిత భాగస్వామినిర్మలా సీతారామన్
పిల్లలు1
తల్లిదండ్రులుపరకాల సీతావతారం, మాజీ మంత్రి
పరకాల కాళికాంబ, మాజీ శాసన సభ్యురాలు

వ్యక్తిగత జీవితంసవరించు

ప్రభాకర్ 1986 లో నిర్మలా సీతారామన్ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె. అతడి తల్లి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా పనిచేసింది. తండ్రి పరకాల శేషావతారం 1970లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు. అతడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివాడు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని పొందాడు.

మూలాలుసవరించు

  1. http://ibnlive.in.com/news/dividing-andhra-is-an-electoral-gambit-by-cong-dr-parakala-prabhakar/410930-62.html

బయటి లంకెలుసవరించు