పరమాణువు, అణువు కంటే చిన్న కణము. అనగా ఇది చాలా చాలా చిన్నది అని అర్థం. ఇది అణువులు, బణువుల వంటిది, పరమాణువును నేరుగా కంటితో చూడటం చాలా కష్టం. ఇది శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరమైనది, వీటి నుంచి ఉత్తమ అణువులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పరమాణువుల గురించి విపులంగా, తేలికగా వివరించే గ్రంథమిది.

ప్రస్తుతం చలామణీలో ఉన్న పరమాణువు సిద్ధాంత పరమైన నమూనా. ఇందులో మధ్యలో దట్టంగా ఉండే కేంద్రకం, దాని చుట్టూ ఎలక్ట్రాన్ల మేఘం (సంభావ్యతా మేఘం/probabilistic cloud ) ఉంటాయి.

దీనిని కొమరవోలు వెంకటసుబ్బారావు రచించారు. దీనికి సర్ శొంఠి వెంకట రామమూర్తి గారు తొలిపలుకు అందించారు. ఇది 1950 సంవత్సరంలో ప్రచురించబడినది.

అంకితం

మార్చు

రచయిత ఈ భౌతికశాస్త్ర గ్రంథాన్ని హిరోషిమా, నాగసాకి పట్టణాలలో ఆటంబాంబు సృష్టించిన విధ్వంసంలో మరణించిన వేలకొలది ప్రజలకు అంకితమిచ్చారు.

విషయసూచిక

మార్చు
  • మొదటి అధ్యాయము : ప్రాచ్యపాశ్చాత్య లక్ష్యభేదములు - సాంఖ్యమతము - వైశేషికమతము - పరమాణు నిర్వచనము - పరమాణు స్వరూప గుణ ధర్మములు - పరమాణువు వలన సృష్టికార్యము ఏరీతికా కలుగుతున్నది - పరమాణు నిత్యత్వము - శంకరాచార్యుల నిర్ణయములు.
  • రెండవ అధ్యాయము : పాశ్చాత్యుల సిద్ధాంతములు - ప్రాచీనులగు గ్రీకుశాస్త్రజ్ఞఉల మతములు - డాల్టన్ పండితుని పరిశోధనలు - పరమాణు వాదము - విద్యుచ్చక్తికి పరమాణువునకు గల సంబంధము.
  • మూడవ అధ్యాయము : విరాట్కణములు - ఋణపీలువు, ధనపీలువు, స్థిరపీలువు - పరమాణు భేదములు - నానావిధ కిరణములు - ఋణధ్రువకిరణములు, ధనధ్రువకిరణములు - ఎక్స్ కిరణములు - దిచ్చలన కిరణములు - ఆల్ఫా కిరణములు - బీటా కిరణములు - గామా కిరణములు - విశ్వమయూఖములు - రశ్మి విభాజనయోగము - కాంతికిని పరమాణువునకును గల సంబంధము.
  • నాలుగవ అధ్యాయము : మహచ్ఛక్తి - చిచ్ఛక్తి - పరమాణు నిర్మాణము తెలిసికొనుటకై శాస్త్రజ్ఞఉలు జరిపిన ప్రయోగములు - పరమాణు పితామహుడు, రూథర్‌ఫర్డు.
  • ఐదవ అధ్యాయము : కాంతి తరంగమయమా? - మాత్రామయమా? - శక్తిమయమా? - ప్లాంకు పండితుని ప్రమాణవాదము - భోరు పండితుని అణుస్వరూపము - డీబ్రోలీ పండితుని ద్రవ్య తరంగవాదము - డిరాకు పండితుని అభావవాదము - హెసెన్‌బర్గ్ పండితుని సందిగ్ధవాదము - బారన్ పండితుని సంభావ్యవాదము - చిచ్ఛక్తి యొక్క క్రియాప్రకారము.
  • ఆరవ అధ్యాయము : అణుగర్భశక్తులు - వాన్ డల్ వాల్స్ శక్తులు - మెసాను శక్తులు - ద్రవ్యములయందలి యవాంతర భేదములు - అణుశక్తి, అయస్కాంతశక్తి.
  • ఏడవ అధ్యాయము : అణుగర్భచ్ఛేదనము - రూథర్‌ఫర్డు ప్రయోగము - కృత్రిమ చిచ్ఛేదన ద్రవ్యములు - వరుణగర్భవ్యాఘట్టనము - అణవాస్త్రము - అణవాస్త్రోత్పత్తిలోని కష్టనష్టములు - ఆస్ఫోటన పటిష్టతకు హేతువులు - పరమాణు బాంబు పంచకము.
  • ఎనిమిదవ అధ్యాయము : పరిశ్రమల యభివృద్ధి కుపయోగించురూపములో పరమాణుశక్తి యుత్పత్తి - ప్రేలుడెట్లు నివారింపబడును - అనుక్రమ విక్రియా స్థూనిక - మనుష్య నిర్మితమైన క్రొత్తమూలద్రవ్యము - ప్లుటోనియము - పరమాణుశక్తి యొక్క భవిష్యత్తు - యురేనియములోని లోపములు - శాంతిసమయములో ప్రేలుడు వలన ప్రయోజనములు - శాస్త్రపరిశోధనలపైని పరమాణు విజ్ఞాన ప్రభావము - పరమాణు శక్త్యుత్పత్తికి నూతనమార్గములు.
  • తొమ్మిదవ అధ్యాయము : విశ్వనిర్మాణ రహస్యములు - జడశక్తి, ప్రాణశక్తి - సాపేక్షవాదము - అద్వైతసిద్ధాంతము - ప్రపంచప్రళయము - పరమాణు బాంబు - మూడవ ప్రపంచయుద్ధము - సాంఘిక, రాజకీయ అంతర్జాతీయ పరిస్థితులపై పరమాణు విజ్ఞానము యొక్క ప్రభావము - ఉపసంహారము.

మూలాలు

మార్చు