జపాన్కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా (Hiroshima). ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగష్టు 6అమెరికా అణుబాంబుకు గురై, నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.

హీరోషిమా నగరాన్ని 1589లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థను కలిగి 1905లో జరిగిన జపాన్-రష్యా యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70 వేల ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల అణుధూళి వల్ల 90,000 నుండి 1,40,000 వరకు మరణించినట్లు లెక్కవేశారు [1]. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జరిగిన కొద్దికాలానికే 1945, సెప్టెంబరు 17 న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీని వల్ల మరో 3 వేలమంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.

2006 ప్రకారము ఈ నగర జనాభా 11,54,391 [2]. ఈ నగర విస్తీర్ణం 905.08 చ.కి.మీ..[3]1910లో ఈ నగరం జనాభా 1,43,000 [4] ప్రపంచ యుద్ధం ముందునాటికి 3,60,000, 1942 నాటికి 4,19,182 వరకు పెరిగింది.[3] 1945 లో ఆణుబాంబు దాడికి గురైన తరువాత జనాభా 1,37,197 కు పడిపోయింది.[3] 1955 నాటికి మళ్ళీ యుద్ధ పూర్వసమయం నాటి జనాభాకు చేరింది.[5]

మూలాలుసవరించు

  1. (ఆంగ్లము)http://www.rerf.or.jp/general/qa_e/qa1.html Archived 2007-09-19 at the Wayback Machine రేడియేషన్ ఎఫెక్ట్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్
  2. (ఆంగ్లము)"జపాన్ జనాభా, పట్టీ 92". Statistics Bureau. Retrieved 2007-08-14. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 3.2 (ఆంగ్లము)"2006 Statistical Profile". The City of Hiroshima. మూలం నుండి 2008-02-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-14. Cite web requires |website= (help)
  4. (ఆంగ్లము)టెర్రీ, థామస్ ఫిలిప్ (1914). టెర్రీస్ జపనీస్ ఎంపైర్. హౌగ్టన్ మిఫ్లిన్ కో. pp. పేజీ 640.
  5. (ఆంగ్లము)డి రాహమ్-అజిమి, నస్రిన్, మాట్ ఫుల్లర్, హిరోకో నకయామా (2003). Post-conflict Reconstruction in Japan, Republic of Korea, Vietnam, Cambodia, East Timor. ఐక్యరాజ్య సమితి ప్రచురణ. pp. పేజీ 69.CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=హిరోషిమా&oldid=2886226" నుండి వెలికితీశారు