పరాగసంపర్కము

(పరాగసంపర్కం నుండి దారిమార్పు చెందింది)
A bee collects nectar, while pollen collects on its body.

పుష్పించే మొక్కలలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం (Pollination) అంటారు. ఫలదీకరణ జరగడానికి ముందు తప్పనిసరిగా పరాగసంపర్కం జరిగితీరాలి. వివృతబీజాలలో అండాలు వివృతంగా (open) ఉండటం వలన పరాగరేణువులు నేరుగా అండద్వారం మీద పడతాయి. ఇటువంటి పరాగసంపర్కాన్ని ప్రత్యక్ష పరాగసంపర్కం (Direct pollination) అంటారు. కానీ ఆవృతబీజాలలో అండాలు అండాశయం లోపల అంతర్గతంగా, సంవృతంగా (closed) ఉండటం వలన పరాగరేణువులు కీలాగ్రంపైన పడతాయి. ఇటువంటి పరాగసంపర్కాన్ని పరోక్ష పరాగసంపర్కం (Indirect pollination) అంటారు.

పరాగసంపర్కంలో రకాలుసవరించు

ఆవృతబీజాలలోని పరాగసంపర్కాన్ని రెండు రకాలుగా విభజించవచ్చును.

 • ఆత్మ పరాగసంపర్కం (Self pollination): ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీద పడడాన్ని ఆత్మ పరాగసంపర్కం లేదా ఆటోగమి అంటారు. ఇది ద్విలింగ పుష్పాలలో మాత్రమే జరగడానికి ఆస్కారముంటుంది.
 • పర పరాగసంపర్కం (Cross pollination): ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పర పరాగసంపర్కం లేదా ఆలోగమి అంటారు. ఇది వివృతసంయోగ పుష్పాలలో జరుగుతుంది. పరాగకోశాలు, కీలాగ్రాలు పుష్పాల నుండి బయటకు పొడుచుకు వచ్చే సంవృతసంయోగ పుష్పాలలో కూడా ఇది కనిపిస్తుంది. దీనిలో రెండు రకాలు గుర్తించవచ్చును.
  • ఏకవృక్ష పర పరాగసంపర్కం: ఈ పర పరాగసంపర్కం ఒకే మొక్కపై నున్న రెండు పుష్పాల మధ్య జరుగుతుంది. అనగా ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కపై నున్న వేరొక పుష్పం కీలాగ్రం మీద పడతాయి. దీనినే ఏకవృక్ష పర పరాగసంపర్కం లేదా గైటినోగమి అంటారు.
  • భిన్నవృక్ష పర పరాగసంపర్కం: ఒక మొక్క మీద ఉన్న పుష్పాలలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కపై నున్న కీలాగ్రం మీద పడటాన్ని భిన్నవృక్ష పర పరాగసంపర్కం లేదా క్సీనోగమి అంటారు.

పర పరాగసంపర్కం వల్ల ఉపయోగాలుసవరించు

చార్లెస్ డార్విన్ పరిశోధనల వలన ఆత్మ పరాగసంపర్కం కంటే పర పరాగసంపర్కం వలన అనేక లాభాలున్నాయని తెలిసింది.

 1. పర పరాగసంపర్కం వలన ఏర్పడే విత్తనాల సంఖ్య అధికంగా ఉంటుంది.
 2. విత్తనాలు బరువుగా, పెద్దవిగా ఉండి, త్వరగా వృద్ధి చెందుతాయి. మొక్కలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
 3. ఈ మొక్కలు భూమిపై తక్కువ విస్తీర్ణాన్ని ఆవరించి, ఎక్కువ పుష్పాలను తక్కువ కాలంలో ఉత్పత్తి చేస్తాయి.
 4. ఈ మొక్కలలో జన్యు వైవిధ్యాలు అధికంగా ఉండటం వలన పునస్సంయోజకాలు (recombinants) ఏర్పడి, మనుగడ కోసం పోరాటంలో అవి ఎక్కువ సార్ధకతను చూపిస్తాయి.
 5. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుంది.

పర పరాగసంపర్కాన్ని ప్రోత్సహించే పద్ధతులుసవరించు

 • ఏకలింగత్వం :
 • భిన్నకాల పక్వత :
 • హెర్కోగమి :
 • భిన్నకీలత :
 • ఆత్మ వంధ్యత్వం :
 • పుప్పొడి పూర్వశక్మత :
 • సూక్ష్మగ్రాహ్య కీలాగ్రాలు :

ఆత్మ పరాగసంపర్కాన్ని ప్రోత్సహించే పద్ధతులుసవరించు

 • ఏకకాల పక్వత :
 • పుష్పభాగాల చలనం :
 • భద్రతా యాంత్రికం :
 • సంవృత సంయోగం :
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.