మందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. ఇదిమాల్వేసి కుటుంబానికి చెందినది. ఇది తూర్పు ఆసియాకు చెందినది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ, సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు, పక్షుల్ని ఆకర్షించవు. [1][2][3]

మందార
మందార పువ్వు IMG20200119142438-01-01.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Family:
Genus:
Species:
హై. రోజా-సైనెన్సిస్
Binomial name
హైబిస్కస్ రోజా-సైనెన్సిస్
ముద్దమందారం

లక్షణాలుసవరించు

 • నక్షత్రాకార కేశాలతో పెరిగే సతత హరితమైన పొద.
 • అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
 • పత్రగ్రీవాలలో ఏకాంతంగా ఏర్పడిన ఎరుపు రంగు పుష్పాలు.
 • దీర్ఘవృత్తాకార ఫలం.

జాతీయ చిహ్నాలుసవరించు

1958 సంవత్సరంలో మలేషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాతీయ పుష్పంగా నామినేట్ చేసింది.జూలై 28 1960 న, మలేషియా ప్రభుత్వం మందార పువ్వు జాతీయ పువ్వుగా ప్రకటించింది.[4]

ఉపయోగాలుసవరించు

 • మందార పువ్వులు,ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
 • మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
 • భారతదేశంలో పువ్వులను దేవతల పూజలోను వాడతారు.
 • స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము, శుభసూచికము.
 • మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
 • మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.[5]

చిత్ర మాలికసవరించు

మూలాలుసవరించు

 1. "Hibiscus rosa-sinensis - Chinese Hibiscus, Shoeblackplant, Tropical Hibiscus, Red Hibiscus - Hawaiian Plants and Tropical Flowers". wildlifeofhawaii.com. Archived from the original on 2019-12-22. Retrieved 2020-01-19.
 2. "Home". internationalhibiscussociety.org (in ఇంగ్లీష్). Archived from the original on 2019-12-22. Retrieved 2020-01-19.
 3. "American Hibiscus Society". americanhibiscus.org. Retrieved 2020-01-19.
 4. Leong, Michelle. "Hibiscus: 11 Facts About Malaysia's National Flower". Culture Trip. Retrieved 2020-01-19.[permanent dead link]
 5. "మందార పూలు.. ఉపయోగాలు ఎన్నో..!" (in ఇంగ్లీష్). Retrieved 2020-01-19.[permanent dead link]

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మందార&oldid=2964813" నుండి వెలికితీశారు