పరిటాల సునీత

పెనుకొండ దివంగత శాసనసభ్యులు శ్రీ పరిటాల రవీంద్ర గారి భార్య శ్రీమతి పరిటాల సునిత.

పరిటాల సునీత
పరిటాల సునీత


నియోజకవర్గం రాప్తాడు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగు దేశం
జీవిత భాగస్వామి పరిటాల రవీంద్ర
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం వెంకటాపురం
మతం హిందూ

ఈమె పెనుకొండ శాసనసభ నియొజక వర్గంనుండి 2005 సం|| ఒక సారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు, ప్రస్తుతము రాప్తాడు నియెుజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు.

పరిటాల సునీత 1970 మే 20 వతేదీన అనంతపురం జిల్లా, రామగిరి మండలం, వెంకటాపురం గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ధర్మవరకు కొండన్న, తల్లి సత్యవతి. ఈమెకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు (బాలాజీ, మురళి) ఉన్నారు.

1984 అక్టోబరు 27 న ఈమె వివాహం పరిటాల రవీంద్రతో జరిగింది. ఒక సాధారణ గృహిణిగా వున్న పరిటాల సునీత, భర్త పరిటాల రవీంద్ర హత్యానంతరం తప్పనిసరి పరిస్థితులలో రాజకీయ రంగప్రవేశం చేయవలసి వచ్చింది.